గూడూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరం

బుట్టా రేణుక, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఇంటింటి ప్రచారం

కర్నూలు జిల్లా:  కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గం గూడూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎల్. పద్మావతితో పాటు పార్టీ తరఫున పోటీ చేస్తున్న వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎంపీ, వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజా సంక్షేమం, పట్టణ అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందని పేర్కొంటూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి ఎల్. పద్మావతితో పాటు వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
 

Back to Top