నెల్లూరులో వైయ‌స్ఆర్‌సీపీలోకి టీడీపీ నుంచి 20 కుటుంబాలు

 59వ డివిజన్‌లో యూసఫ్‌ మిత్రబృందం చేరిక

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేయర్‌ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలోకి ఆహ్వానం

నెల్లూరు: నెల్లూరు నగరంలో వైయ‌స్ఆర్‌సీపీకి మద్దతుగా పలువురు పార్టీ మారుతున్నారు. నెల్లూరు రాంజీనగర్‌లోని వైయ‌స్ఆర్‌సీపీ సిటీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేయర్‌ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో 59వ డివిజన్‌కు చెందిన యూసఫ్‌ మిత్రబృందం 20 కుటుంబాలు టీడీపీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి నాయకులు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తాం

వైయ‌స్ఆర్‌సీపీపై విశ్వాసంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీకి చేరువవుతున్నారని, ఆ పార్టీలో ఇమడలేక పలువురు వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల మద్దతుతో వైయ‌స్ఆర్‌సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సంక్షేమం, అభివృద్ధికి వైయ‌స్ఆర్‌సీపీ ప్రాధాన్యం

రాబోయే వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఉంటుందని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 59వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి చీదెళ్ల కిషన్‌, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top