నంద్యాల జిల్లా: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం సిద్దేపల్లి గ్రామంలో వైయస్ఆర్సీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్త శశికళ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గురువారం గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మార్త శశికళ ఇంటింటా పర్యటిస్తూ కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. వైయస్ఆర్సీపీ మద్దతుతో పోటీ చేస్తున్న వార్డు సభ్యులను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండటం, స్థానిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తా తనను సర్పంచ్‌గా గెలిపిస్తే సిద్దేపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మార్త శశికళ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చొరవ తీసుకుంటానని, గ్రామ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ మార్త భాస్కర్, పార్టీ మండల నాయకులు రేనాటి రమణారెడ్డి, పొందుగుల రమణారెడ్డి, చంద్రారెడ్డి, సుంకన్న, మార్త చిన్న నాగన్న, నడిపి దరగయ్య, రామన్న, త్యాగరాజు, నీసు యేసేపు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటా పర్యటిస్తూ మార్త శశికళకు, వైయస్ఆర్సీపీ మద్దతు సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.