విజయవాడ సెంట్రల్ : రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సింగినగర్‌లోని జనహిత సదనం కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మల్లాది విష్ణు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులను అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులతో అడ్డుకోవడం, నామినేషన్లు వేయకుండా నిరోధించడం, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. మంచి పాలకుల చేతిలో రాజ్యాంగం ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రస్తుత ప్రభుత్వంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాలు, పోలీసుల ఏకపక్ష వైఖరి, హౌస్ అరెస్టులు, ఓటు హక్కుకు ఆటంకాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యలని మల్లాది విష్ణు పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధమైన పాలన అందించి విద్య, వైద్యం, గృహ నిర్మాణం వంటి రంగాల్లో పేదలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలిచి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ ఎస్ఈసీ సభ్యుడు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కాలే పుల్లారావు, మాజీ డిప్యూటీ మేయర్ ఆవుతు శ్రీశైలజారెడ్డి, 78వ డివిజన్ కార్పొరేటర్ తోపుల వరలక్ష్మి, మాజీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి తదితరులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.