ఆళ్లగడ్డ ఆసుపత్రిలో గాయపడిన వారికి గంగుల బ్రిజేంద్రారెడ్డి పరామర్శ 

నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘటనల్లో గాయపడిన వారిని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మెరుగైన వైద్యం కోసం బాధితులను నంద్యాల ఆసుపత్రికి తరలించారు. 

Back to Top