తాడేపల్లి: రాజ్యాంగ ఆమోద దినోత్సవం రోజే పల్లె పోరులో ప్రజాస్వామ్యానికి పచ్చనేతలు తూట్లు పొడిచారు. ఓటు హక్కుతో ప్రజలు తమ నాయకులను ఎన్నుకోవాల్సిన పోలింగ్ కేంద్రాలనే అధికార పార్టీ వర్గాలు తమ రిగ్గింగ్‌కు వేదికలుగా మార్చుకున్నాయి. బూత్‌ల లోపల టీడీపీ ఏజెంట్లు రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే.. బయట పోలీసులు వారికి రక్షణగా నిలిచిన పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్ల చేతుల్లోని స్లిప్పులు లాక్కోవడం, వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు పంపించడం, అక్రమాలను ప్రశ్నించిన ఓటర్లపై లాఠీఛార్జ్ చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓటు వేసేందుకు వచ్చిన సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, తమకు నచ్చిన విధంగా ఎన్నికల ప్రక్రియను నడిపించేందుకు టీడీపీ వర్గాలు ప్రయత్నించాయి. ప్రజాస్వామ్యానికి కాపలాగా నిలవాల్సిన పోలీసులు, ఎన్నికల యంత్రాంగమే అధికార పార్టీకి అండగా నిలిస్తే ఇక సామాన్యుడి ఓటు హక్కుకు రక్షణ ఎక్కడ?. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన రోజునే రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కడం ప్రజాస్వామ్యానికి జరిగిన ఘోర అవమానం. మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ఇలా: ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కూచిపూడిలో టీడీపీ ఏజెంట్ల రిగ్గింగ్.. వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల నుంచి బయటకు పంపివేత. కూచిపూడిలో బూత్ లోపల టీడీపీ ఏజెంట్ల రిగ్గింగ్.. బయట పోలీసుల కాపలా. కూచిపూడిలో ఓటర్ల చేతుల్లోని స్లిప్పులు లాక్కున్న టీడీపీ ఏజెంట్లు.. అడ్డుకున్న ఓటర్లపై పోలీసుల లాఠీఛార్జ్. రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం రౌతుకుంటలో సర్పంచ్ అభ్యర్థి, ఏజెంట్లకు టీడీపీ వర్గాల అడ్డంకులు. రౌతుకుంటలో సర్పంచ్ అభ్యర్థి వేణుగోపాల్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అభ్యర్థులు, గ్రామస్తుల ఆందోళన. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నాగసముద్రంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు. నాగసముద్రంలో వైయస్ఆర్‌సీపీకి ఓటేస్తే చంపేస్తామంటూ టీడీపీ వర్గాల బెదిరింపులు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలో పోలింగ్ కేంద్రాల సమీపంలో టీడీపీ నేతల నగదు పంపిణీ. జి.కొండూరులో టీడీపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి తరఫున ఓటర్లకు డబ్బుల పంపిణీ. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరులో బయట ప్రాంతాల నుంచి టీడీపీ కౌన్సిలర్లను తరలించి రిగ్గింగ్. వెల్లటూరులో పోలీసుల సమక్షంలోనే అక్రమాలు.. ప్రశ్నించినా స్పందన లేక గ్రామస్తుల ఆగ్రహం. శ్రీ సత్యసాయి జిల్లా గొట్లూరు పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి సత్యకుమార్ పీఏ హరీష్ రిగ్గింగ్‌కు యత్నం.. స్థానికుల అడ్డుకట్ట. గన్నవరంలో టీడీపీ నేతల రిగ్గింగ్‌పై వైయస్ఆర్‌సీపీ నేతల ఆందోళన. గన్నవరం పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే వంశీ. చిత్తూరులో వైయస్ఆర్‌సీపీ నేత విజయానందరెడ్డిపై టీడీపీ వర్గీయుల దాడికి యత్నం. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగలో ఎమ్మెల్సీ నర్తు రామారావుపై రాళ్ల దాడి.. పలువురికి గాయాలు. లండారిపుట్టుగ రాళ్ల దాడిలో ఎమ్మెల్సీ గన్‌మ్యాన్‌కు గాయాలు. విజయవాడ నూతక్కిలో ఎన్నికల కవరేజ్ చేస్తున్న సాక్షి విలేకరి ఫోన్ లాక్కుని ధ్వంసం. రాజమండ్రిలో వైయస్ఆర్‌సీపీ నేతలను ఎందుకు అనుమతించారంటూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు హడావుడి. రాజమండ్రిలో సోము వీర్రాజు తొడకొట్టి బస్తీమే సవాల్ అంటూ రెచ్చిపోయిన వైనం. నంద్యాల జిల్లా అహోబిలంలో ఎమ్మెల్యే అఖిలప్రియ కాన్వాయ్ వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులపైకి దూసుకెళ్లడం.. ఐదుగురికి గాయాలు. అహోబిలంలో కాన్వాయ్ కింద మహిళ చిక్కుకుని తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలింపు. అనంతపురంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను తెల్లవారుజామునే పోలీసులు గృహ నిర్బంధం. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురంలో వైయస్ఆర్‌సీపీ పోలింగ్ ఏజెంట్ రాంబాబుపై టీడీపీ వర్గాల మూకుమ్మడి దాడి.. తీవ్ర గాయాలు. శ్రీరాంపురంలో రాంబాబుపై దాడి అనంతరం టీడీపీ వర్గాలు పోలింగ్ బూత్‌లోకి చొరబాటు. నెల్లూరు జిల్లా కావలి డివిజన్ సర్వాయపాళెంలో పోలింగ్ బూత్ సమీపంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి తరఫున నగదు పంపిణీ. కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ వర్గాల దొంగ ఓట్ల హల్‌చల్. ఆలూరులో దొంగ ఓట్లు వేసిన తర్వాత పెట్రోల్‌తో సిరా గుర్తులు చెరిపివేత. దొంగ ఓట్లను వీడియో తీసిన వైయస్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ వర్గాల దౌర్జన్యం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి, కొండేపి నియోజకవర్గాల్లో టీడీపీ వర్గాల దౌర్జన్యాలు. కూచిపూడిలో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపి టీడీపీ ఏజెంట్ల రిగ్గింగ్. నంద్యాల జిల్లా కానాల పోలింగ్ బూత్‌లో మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ తిష్ట.. ఓటర్లకు ప్రలోభాలు. గొట్లూరు పోలింగ్ బూత్‌లో మంత్రి సత్యకుమార్ పీఏ హరీష్ రిగ్గింగ్‌కు యత్నం.. మహిళల అడ్డుకట్ట. ప్రకాశం జిల్లా కొండెపి మండలం పెట్లూరులో టీడీపీ ఏజెంట్ల చేతుల్లో ఓటర్ల స్లిప్పులు. పెట్లూరులో స్లిప్పుల లాక్కోవడాన్ని ప్రశ్నించిన వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ దాడులు. అన్నమయ్య జిల్లా శెట్టిపల్లిలో వైయస్ఆర్‌సీపీ మాజీ జెడ్పీటీసీ ఉపేంద్రరెడ్డి అరెస్ట్.. గ్రామస్తుల ఆగ్రహం. ఉపేంద్రరెడ్డి అరెస్టుకు వ్యతిరేకంగా శెట్టిపల్లిలో గ్రామస్తుల నిరసన. కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ వర్గాల దొంగ ఓట్ల ప్రయత్నాలు. తాడిగడపలో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపేందుకు టీడీపీ నేతల ప్రయత్నాలు. తాడిగడప పోలింగ్ బూత్ వద్ద టీడీపీ ఏజెంట్ రమేశ్ ఓవరాక్షన్. నంద్యాల జిల్లా జంబులదిన్నెలో వైయస్ఆర్‌సీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ. జంబులదిన్నెలో ఘర్షణ సందర్భంగా మహిళ చెవికమ్మలు లాక్కెళ్లడం. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులను పోలింగ్ బూత్‌లోకి వెళ్లనీయకుండా టీడీపీ నేతల అడ్డంకులు. జొన్నలగడ్డలో రిగ్గింగ్, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా మహిళల ధర్నా. జొన్నలగడ్డలో పోలీసులతో మహిళల తీవ్ర వాగ్వాదం.. ఉద్రిక్తత. తిరుపతి జిల్లా మంగంపేటలో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్ ఫారం చించివేత.. నేతలపై టీడీపీ దాడి. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి, కనగానపల్లి మండలాల్లో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను బయటకు గెంటేసి రిగ్గింగ్. రాప్తాడులో నిరసనగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బైఠాయింపు. పల్నాడు జిల్లా జొన్నలగడ్డలో ఓటు వేసేందుకు వెళ్లిన వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ దాడులు. జొన్నలగడ్డ పోలింగ్ కేంద్రం వద్ద పెద్ద కర్రలతో టీడీపీ వర్గాల మోహరింపు. జొన్నలగడ్డలో టీడీపీ దాడుల్లో పలువురు వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు గాయాలు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలో పోలింగ్ బూత్‌ల వద్ద టీడీపీ నేతల నగదు పంపిణీ. జి.కొండూరులో నగదు పంపిణీ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోని పరిస్థితి. అనంతపురం జిల్లా తగరకుంటలో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థిపై పరిటాల వర్గం దాడి. కూచిపూడిలో ఓటర్ల చేతుల్లోని స్లిప్పులు లాక్కున్న టీడీపీ ఏజెంట్లు. కూచిపూడిలో టీడీపీ ఏజెంట్లపై తిరగబడిన ఓటర్లపై పోలీసుల లాఠీఛార్జ్. రాప్తాడులో వైయస్ఆర్‌సీపీకి ఓటేస్తే చంపేస్తామంటూ టీడీపీ వర్గాల బెదిరింపులు. నాగసముద్రం పోలింగ్ బూత్ వద్ద పరిటాల సునీత వర్గీయుల తిష్ట. శ్రీకాళహస్తి ఊరందూరు 34వ వార్డులో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్ నవీన్‌పై దాడి.. చెంపపై కొట్టి బయటకు పంపివేత. కూచిపూడిలో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల నుంచి పోలీసులు బయటకు పంపివేత. కూచిపూడిలో బూత్ లోపల టీడీపీ ఏజెంట్ల రిగ్గింగ్.. బయట పోలీసుల కాపలా. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం మాయలూరులో టీడీపీ నేత భూమా విఖ్యాత్‌రెడ్డి బూత్‌లోకి చొరబడి పోలింగ్ నిలిపివేత. పల్నాడు జిల్లా వినుకొండలో వైయస్ఆర్‌సీపీ మద్దతుదారుల అక్రమ నిర్బంధాలు. గుమ్మనంపాడు, పేర్లపాడు, రేవిడిచెర్ల, వెల్లటూరులో సర్పంచ్, వార్డు అభ్యర్థులకు హౌస్ అరెస్టులు. గుంటుపాలెం, శావల్యాపురం, ఊడిజర్ల, కొండముట్లలో సర్పంచ్ అభ్యర్థుల అరెస్టులు. కర్నూలు జిల్లా ఆలూరు పోలింగ్ బూత్ వద్ద వైయస్ఆర్‌సీపీ నేతల అరెస్టులు. ఆలూరులో కేసులు లేకుండా అరెస్టులు చేయడంపై వైయస్ఆర్‌సీపీ నేతల ఆగ్రహం. నంద్యాల జిల్లా కాణాల గ్రామంలో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నేతల ఓటర్ల ప్రలోభాలు. కర్నూలు జిల్లా ఆదోని మండిగిరిలో ఓటర్లను టీడీపీ నేత కృష్ణమ్మ వీడియోలు తీయించడం. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో ఎస్‌ఐ రమేష్ దౌర్జన్యం.. కూచిపూడిలో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్ల అక్రమ నిర్బంధం. అనంతపురంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు నోటీసులు లేకుండానే గృహ నిర్బంధం. తాడేపల్లిలో వైయస్ఆర్‌సీపీ మంగళగిరి మాజీ ఇన్‌చార్జి, మేయర్ అభ్యర్థి చీఫ్ ఏజెంట్ వేమారెడ్డిని పోలింగ్ కేంద్రం నుంచి పోలీసులు బయటకు పంపివేత. తాడేపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద భారీగా టీడీపీ శ్రేణుల మోహరింపు.. పోలీసులు పట్టించుకోని పరిస్థితి. తాడేపల్లిలో టీడీపీ శ్రేణుల దృశ్యాలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులను పోలీసులు అడ్డుకుని వీడియోలు తీయొద్దంటూ హెచ్చరిక. అహోబిలంలో అఖిలప్రియ కాన్వాయ్ ఘటనలో వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులపైకి కారు దూసుకెళ్లడం.. ఐదుగురికి గాయాలు. రాజమండ్రిలో సోము వీర్రాజు వైయస్ఆర్‌సీపీ నేతలను ఎందుకు అనుమతించారంటూ హడావుడి.. తొడకొట్టి సవాల్. శ్రీకాళహస్తిలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు అక్రమ అరెస్టులు, నిర్బంధాలు. శ్రీకాళహస్తిలో పఠాన్ ఫరీద్, రామచంద్రరెడ్డి, సిరి నాగేశ్వరరావు, పగడాల రాజులకు నిర్బంధం. శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డిని పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోవాలని పోలీసుల ఆదేశం. శ్రీకాళహస్తి 20, 26వ వార్డుల వద్ద సుమారు 200 మంది బయటి వ్యక్తుల మోహరింపు. శ్రీకాళహస్తి 34వ వార్డులో వైయస్ఆర్‌సీపీ పోలింగ్ ఏజెంట్ నవీన్‌పై దాడి చేసి బయటకు పంపివేత. శ్రీకాళహస్తిలో శరవణతో పాటు ఆరుగురు ముఖ్య నాయకులకు బైండోవర్ నోటీసులు. శ్రీకాళహస్తిలో సూరా సురేష్, పఠాన్ ఫరీద్, షేక్ మహమ్మద్ బాషా తదితర వైయస్ఆర్‌సీపీ నేతలను పోలీసులు లక్ష్యంగా చేసుకోవడం. శ్రీకాళహస్తిలో వైయస్ఆర్‌సీపీ జనరల్ పోలింగ్ ఏజెంట్ నియామక పత్రాలపై అధికారుల ఇబ్బందులు.. కలెక్టర్ జోక్యంతో అనుమతి. శ్రీరాంపురంలో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్ వెల్ది రాంబాబుపై టీడీపీ నేత కేసుబాబు, అనుచరుల మూకుమ్మడి దాడి.. తీవ్ర గాయాలు. శ్రీరాంపురంలో రాంబాబుపై దాడి అనంతరం టీడీపీ వర్గాల పోలింగ్ బూత్‌లోకి చొరబాటు. జొన్నలగడ్డలో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి రానివ్వకుండా టీడీపీ ఏజెంట్ల అడ్డంకులు. జొన్నలగడ్డలో వైయస్ఆర్‌సీపీ మహిళా ఏజెంట్లపై దాడి చేసి బూత్ నుంచి బయటకు పంపివేత. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్యకు హౌస్ అరెస్ట్. శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు హౌస్ అరెస్ట్.. ఇద్దరు వైయస్ఆర్‌సీపీ నేతలను ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలింపు. శ్రీకాళహస్తి 18వ వార్డులో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్ ఫరీద్ అరెస్ట్.. 24, 26వ వార్డుల్లో ఏజెంట్లను బయటకు పంపివేత. కావలి రూరల్ మండలం చెన్నైపాళెంలో వైయస్ఆర్‌సీపీ నేత ప్రసాద్ కిడ్నాప్. కావలి ప్రాంతంలో ముఖ్య వైయస్ఆర్‌సీపీ నేతలకు హౌస్ అరెస్టులు.. బెదిరింపులు. నంద్యాల జిల్లా కాణాల గ్రామంలో ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా టీడీపీ నేతల ఓటర్ల ప్రలోభాలు. తాడేపల్లిగూడెం 10వ వార్డులో వైయస్ఆర్‌సీపీ నాయకుడు వడ్డి రఘురామ్ నాయుడు ఓటు హక్కు వినియోగం. రాజాం పురపాలక ఎన్నికలు 21 ఏళ్ల తర్వాత నిర్వహణ.. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్. జొన్నలగడ్డలో ఓటు వేసేందుకు వచ్చిన వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులను టీడీపీ, కూటమి కార్యకర్తలు అడ్డుకోవడం. జొన్నలగడ్డలో ఓటర్ల చేతుల్లోని స్లిప్పులు టీడీపీ కార్యకర్తలు లాక్కోవడం.. పోలీసులు పట్టించుకోని పరిస్థితి. జొన్నలగడ్డలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌కు ప్రయత్నం.. డీఎస్పీ, సీఐలతో మహిళల వాగ్వాదం.