అన్నమయ్య జిల్లా : శెట్టిపల్లిలో వైయస్ఆర్‌సీపీ మాజీ జెడ్పీటీసీ గోర్ల ఉపేంద్రరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. బలవంతంగా ఆయనను అదుపులోకి తీసుకోవడంపై గ్రామస్థులు తిరగబడి నిరసన వ్యక్తం చేశారు. ఉపేంద్రరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు వైయస్ఆర్‌సీపీ నేతను ఎందుకు అరెస్టు చేశారో స్పష్టం చేయాలని గ్రామస్థులు ప్రశ్నించారు. అక్రమ అరెస్టులు, పోలీసుల వేధింపులను నిలిపివేయాలని వైయస్ఆర్‌సీపీ వర్గాలు కోరాయి.