నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 1వ డివిజన్ వైయస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ కరిముల్లాపై దాడి ఘటన కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి 3.30 గంటల సమయంలో ముఖాలకు మాస్కులు ధరించిన కూటమి నాయకుల అనుచరులు కత్తులతో దాడి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడినట్లు వైయస్ఆర్సీపీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థులపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.