ఒంగోలులో వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరం

కుప్పం ప్రసాద్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు

ఒంగోలు: ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి కుప్పం ప్రసాద్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, నియోజకవర్గ పరిశీలకులు వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగర ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంతో ఒంగోలు నగరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Back to Top