రబ్బర్ బుల్లెట్‌ తగిలి గాయపడిన యువకుడికి వైయ‌స్‌ జగన్‌ భరోసా

పులివెందులలో గండికోట పవన్‌కుమార్‌ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా

పులివెందుల : పోలీసుల కాల్పుల్లో రబ్బర్‌ బుల్లెట్‌ తగిలి తీవ్రంగా గాయపడిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త గండికోట పవన్‌కుమార్‌ను వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పులివెందుల పట్టణానికి చెందిన గండికోట నాగభూషణం కుమారుడు పవన్‌కుమార్‌ ఈ నెల 17న నామినేషన్‌ సందర్భంగా జరిగిన ఘటనలో కాలికి రబ్బర్‌ బుల్లెట్‌ తగిలి తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్‌ జగన్‌ను పవన్‌కుమార్‌ కలిసి తనకు జరిగిన ఘటనను వివరించారు. ఈ సందర్భంగా పవన్‌కుమార్‌ ఆరోగ్య పరిస్థితి, కాలికి తగిలిన గాయం తీవ్రత గురించి వైఎస్‌ జగన్‌ అడిగి తెలుసుకున్నారు.

అన్ని విధాలుగా అండగా ఉంటాం

గాయం కారణంగా ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని పవన్‌కుమార్‌కు వైయ‌స్‌ జగన్‌ సూచించారు. కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాయపడిన యువకుడిని పరామర్శించి, ఆయనకు ధైర్యం చెప్పడం ద్వారా పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచారు.

Back to Top