కాసేప‌ట్లో  వైయ‌స్సార్‌ ఉచిత పంటల బీమా  నగదు జమ

 తాడేపల్లి నుంచి నగదు జమ చేయనున్న సీఎం వైయ‌స్‌ జగన్‌

 తాడేప‌ల్లి:  వైయ‌స్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్‌–2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,820.23 కోట్లు జమ చేయనుంది.  కాసేప‌ట్లో  గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో నోటిఫైడ్‌ పంటలకు ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే బీమా వర్తింపచేసేవారు. దీంతో ఆర్థిక స్తోమత, అవగాహన లేక లక్షలాది మంది రైతులు బీమా చేయించుకోలేక ఆర్థికంగా నష్టపోయేవారు. పైగా బీమా సొమ్ములు ఎప్పుడొస్తాయో.. ఎంతొస్తాయో, ఎంతమందికి వస్తాయో తెలియని పరిస్థితి ఉండేది. ఈ దుస్థితికి చెక్‌ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై పైసా భారం పడనీయకుండా.. తానే భారాన్ని భరిస్తూ ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఏడాది తిరగకుండానే ఠంచనుగా పంటల బీమా సొమ్ములు చెల్లించాలన్న లక్ష్యంతో ఖరీఫ్‌– 2019 సీజన్‌కు సంబంధించి 9.79 లక్షల మంది రైతులకు రూ.1,252.18 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం 5.58 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.715.84 కోట్ల బకాయిలను కూడా చెల్లించి వారికి అండగా నిలిచింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top