చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు

 పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ 
 

విశాఖపట్నం: చంద్రబాబు తన రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతార‌ని మంత్రి అవంతి శ్రీ‌నివాస్ మండిప‌డ్డారు. చంద్ర‌బాబు కుల రాజకీయాలను ప్రజలు నమ్మలేదు. దీంతో చంద్రబాబుకు వేరే దారిలేక ఇప్పుడు మతంతో రాజకీయాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. శనివారం మంత్రి అవంతి సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు డిక్లరేషన్‌ను వివాదం చేస్తున్నారు. దేవాలయాలపై దాడులు మతమార్పిడి కోసమని చంద్రబాబు అర్థం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారు. దేవాలయాలపై దాడులు చేసి వారిని వదిలి పెట్టేది లేదు' అంటూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top