ఉరకలేసిన జనగోదావరి 

17వ రోజు ముఖ్యమంత్రి  వైయస్.జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర 

ఒకవైపు వేదంలా ఘోషించే గోదావరి... మరోవైపు జగన్ నామంతో హోరెత్తిన జనగోదావరి 
 
మోరంపూడి జంక్షన్ చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సుయాత్ర 

తూర్పు గోదావ‌రి జిల్లా:   మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 17వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదగా కొనసాగుతోంది. సీఎం జగన్‌కు ప్రజల్లో అమితాదరణ లభిస్తోంది. కిలోమీటర్ల కొద్దీ వీరాభిమానులు వెన్నంటి వస్తున్నారు.  రోజుల తరబడి, జిల్లాలు దాటి, ఎండా, వాన లెక్క చేయకుండా, వ్యయప్రయాసలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్ల మేర సీఎం జగన్‌ వెంట ప్రయాణం చేస్తున్నారు. నిప్పులు చెరుగుతున్న మండుటెండలను లెక్క చేయకుండా వేలాది మంది వేచి చూసి మరీ సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్నారు. రావులపాలెం సెంటర్‌లోనయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం ఉప్పెనలా తరలివచ్చి అఖండ స్వాగతం పలికారు. భారీగా జనం పోటెత్తడంతో జాతీయ రహదారి పూర్తిగా కిక్కిరిసిపోయింది. 
మోరంపూడి రోడ్డులో గుమ్మడికాయలతో దిష్టితీసి.. హారతుల పట్టి ఆక్కచెల్లెమ్మల ఆత్మీయ స్వాగతం.
రాజమండ్రి నగరంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ రోడ్ షో.

జనంతో కిక్కిరిసిన రాజమండ్రి రహదారులు. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మెలు, అన్నదమ్ములు.. పసిపిల్లల తల్లుతో సహా సీఎం  వైయస్.జగన్ బస్సుయాత్రకు సంఘీభావంగా తరలివచ్చిన జన ప్రభంజనం.

Back to Top