మేమంతా సిద్ధం

బ‌స్సు యాత్ర వైయ‌స్ఆర్‌సీపీ జైత్రయాత్రకు సంకేతం 

మరో 18  రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.. మీకు మంచి జరిగి ఉంటే ఓటు వేయండని అడిగే ధైర్యమే సిద్ధమ‌న్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చాం. పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ దిగజారిపోయారు.

పాడేరు బీజేపీ ఇన్‌చార్జ్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతాపార్టీల నుంచి ప‌లువురు కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. 

థ్యాంక్యూ జ‌గ‌న‌న్న‌

చిన్నారి త్రిషాన్ ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి.

వైయ‌స్ఆర్ సీపీలో చేరిన ఎచ్చ‌ర్ల టీడీపీ కీల‌క నేత‌లు

శ్రీ‌కాకుళం: ఎచ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ సీపీలో జాయిన్ అయ్యారు. మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్‌లో వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. అదే విధంగా ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం మండలం మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పుకున్నారు. 

వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియ‌ర్ నేత‌

శ్రీకాకుళం: టీడీపీ సీనియ‌ర్ నేత వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పుకున్నారు. `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర‌లో భాగంగా 22వ రోజు ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో పార్వతీపురం నియోజకవ‌ర్గానికి చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మ‌హిళా క‌మిష‌న్ మాజీ స‌భ్యురాలు కొయ్యాన శ్రీ‌వాణి వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆమెకు వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

22వ రోజు `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర ప్రారంభం

శ్రీ‌కాకుళం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర 22వ రోజు ఎచ్చెర్ల నియోజకవర్గం అక్కివలస నుంచి ప్రారంభ‌మైంది. అక్కివ‌లస‌ నైట్ స్టే పాయింట్ నుంచి భారీ జ‌న‌సందోహం మ‌ధ్య ప్రారంభ‌మైన వైయస్ జగన్ బ‌స్సు యాత్ర కొద్దిసేప‌టి క్రిత‌మే చిల‌క‌పాలెం మీదుగా ఎచ్చర్ల‌కు చేరుకుంది. ఎచ్చెర్ల‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

మీ డ్రీమ్స్‌ను నా స్కీమ్స్‌తో నెరవేర్చాను 

ఒక్క వైయ‌స్ జగన్‌ మీదకు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్‌ ఎగబడుతున్నారని మండిపడ్డారు. ఇంత మంది తోడేళ్లు ఏకమై తన మీద యుద్ధానికి వస్తున్నారని తెలిపారు. పెత్తందార్లకు, నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా  ఉన్నారని స్పష్టం చేశారు. 

ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం

జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో శాశ్వతంగా ఉండాలి, కావాలని ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఈ మానసిక ధైర్యంతో శత్రుసేనను భారతంలో కౌరవుల మీద దండెత్తిన పాండవుల్లాగా ముందుకెళ్తున్నాం.

రేప‌టితో ముగియ‌నున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 

అనంతరం సాయంత్రం 4 గంటలకు లంచ్‌ క్యాంప్‌‌ నుంచి అక్కవరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకుబయల్దేరుతారు. 4.20 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.20 గంటల వరకు సభలో ప్రసంగించనున్నారు.

వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు

ముఖ్యమంత్రిని కలిసిన వైయ‌స్ఆర్‌ టీయూసీ జనరల్ సెక్రటరీ వై మస్తానప్ప, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చైర్మన్, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ పి ఆదినారాయణ, పోరాటసమితి చైర్మన్ మంత్రి రాజశేఖర్, సీఐటియూ స్టేట్ జనరల్ సెక్రటరీ, పోరాట సమితి చైర్మన్ సీహెచ్ నరసింగరావు, స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె వి డి ప్రసాద్.

Pages

Back to Top