విజయనగరం జిల్లా: ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు గెలిచి జగనన్నకు కానుకగా ఇస్తామని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. మేమంతా సిద్ధం బహిరంగసభలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ప్రసంగించారు. వీరభధ్రస్వామి ఏమన్నారంటే... జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. అన్నా.. మీ వెన్నంటి నడిచేందుకు మేమంతా సిద్ధం. చంద్రబాబు నాయుడు ఇతర రాజకీయ పార్టీల అండతో సిద్ధమైతే.. మీరు ప్రజల అండతో ఈ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్న తరుణంలో మేమంతా మీకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసేందుకు వచ్చారన్నా ఈ జనవాహిని. జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనపై సామాన్య కార్యకర్త ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తూ జగన్ మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా అని అడిగితే అందుతున్నాయని చెప్పిన ప్రజలకు ఏమైనా లంచమిస్తున్నారా అని ధైర్యంగా అడిగే నాయకత్వం పరిపాలన ఈరోజు ఆంధ్రరాష్ట్రంలో కొనసాగుతోంది. మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుని మేము ధైర్యంగా ప్రజలను ఓట్లు అడుగుతున్నాం. జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో శాశ్వతంగా ఉండాలి, కావాలని ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఈ మానసిక ధైర్యంతో శత్రుసేనను భారతంలో కౌరవుల మీద దండెత్తిన పాండవుల్లాగా ముందుకెళ్తున్నాం. ఈరోజు మీరు మొదలుపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఒక్కొక్క సభలో మీరు చేసిన ప్రసంగం విని వాస్తవాలు ప్రజలు తెలుసుకుని మేమంతా జగన్ మోహన్ రెడ్డి వెన్నంటి ఉంటామని తెలియజేస్తుంటే ప్రతిపక్షపార్టీలు ఎన్నికలను ఎదుర్కొవటానికి కూడా సిద్ధంగా లేక చతికిలపడిపోయాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గత ఎన్నికల్లోగా తొమ్మిదికి 9 సీట్లు మీకు కానుకగా ఇస్తామని తెలియజేసుకుంటూ.. జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నాను.