విజయవాడ: కూటమి ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుందని.. సంక్షేమ పథకాలు, కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. వైయస్ జగన్ కార్మికుల కోసం పనిచేశారన్నారు. గురువారం.. వైయస్ఆర్‌సీపీ టీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, వైయస్ జగన్ హయాంలో ఆటో కార్మికులకు వాహన మిత్ర పేరుతో రూ.10 వేలు అందించేవారని.. కేసులు, పైన్స్ లేకుండా చేశారన్నారు. ఇప్పుడు ఆటో రోడ్డు ఎక్కితే పైన్స్ వసూళ్లు చేస్తున్నారు. చిరు వ్యాపారులకు జీవన భృతి కోసం 10 వేలు, గుర్తింపు కార్డు జగన్ ఇచ్చారు. చిరు వ్యాపారులు టీడీపీ నేతలకు ప్రతిరోజు లంచాలు ఇవ్వాల్సిన పరిస్ధితి వచ్చింది. వైఎస్ జగన్ ఆప్కాస్ పెట్టి మున్సిపల్ కార్మికులను ఆదుకున్నారు. ఉద్యోగాలు ఇచ్చారు. ఆప్కాస్‌ను కూటమి ప్రభుత్వం తీసేయాలని చూస్తుంది. ఏ ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వ పాలనలో సంతోషంగా లేదు’’ అని అవినాష్ పేర్కొన్నారు. ‘‘సంక్షేమం లేదు.. అభివృద్ది లేదు.. ప్రజలను కూటమి ప్రభుత్వ మోసం చేస్తుంది. సింహచలం వంటి ఘటన ఎప్పుడైన జరిగిందా?. తొక్కిసలాట.. తోపులాట ఎప్పుడు జరగలేదు. రాష్ట్రంలో పాలన ఉందా? అనే అనుమానం కలుగుతుంది. వైకుంఠ ఏకాదశినాడు తిరుపతిలో చనిపోయారు. ఇప్పుడు సింహాచలంలో చనిపోయారు. రైడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంపైనే దృష్టి పెడుతున్నారు. వైజాగ్ మా నాయకుడు వెళ్లాడు.. మీరు ఒక్కరైన వెళ్లారా?. వైఎస్ జగన్ కట్టిన రక్షణ గోడ లక్షలాది మందిని కాపాడింది. మీరు కట్టిన గోడ నాసిరకంగా కట్టడంతో 8 మంది చనిపోయారు. వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి కార్మికుడికి వైయస్ జగన్, వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది’’ అని దేవినేని అవినాష్ చెప్పారు.