‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలా

సీఎం వైయస్ జగన్‌ బస్సు యాత్రకు ప్రజల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో స్పందన

తూర్పుగోదావరి: సీఎం జగన్‌ బస్సు యాత్రకు ప్రజల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా యాత్ర కొనసాగుతోంది. గోదావరి జిల్లాల్లో జన జాతరను తలపిస్తోంది. పల్లెల నుంచి పట్టణాల వరకూ తరలివచ్చిన జన సందోహంతో రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నడినెత్తిన సూరీడు 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతతో నిప్పులు చెరుగుతున్నా లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూడాలని, ఆయనతో మాట కలపాలని రోడ్డుకు ఇరువైపులా బారులు తీరుతున్నారు. ఆయనకు అప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో దారిపొడవునా సీఎం వైఎస్ జగన్ కోసం జనం వేచి చూసి మరీ స్వాగతం పలికారు. సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ జరగనుంది

దిక్కులు నాలుగే. కానీ ‘తూర్పు’ ఓ ప్రత్యేకత ఉంటుంది!
ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేది ఈ దిక్కునే మరి.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో  ‘తూర్పు’ గోదావరి స్పెషాలిటీ ఏంటన్నది..
మనమిప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు...

ఈ జిల్లాపై పట్టు అధికారానికి మెట్టు అని చరిత్ర ఇప్పటికే చాలాసార్లు చెప్పింది!
అలాంటి ‘తూర్పు’లో జగనన్న ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కొత్త చరిత్రను లిఖిస్తోంది

బస్సు యాత్ర ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు!
కాదూ కూడదు.. మాకు రుజువు కావాలంటున్నారా? చాలా సింపుల్‌... 

ఇవ్వాళ రంగంపేటలో మొదలైన యాత్ర, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు చేరుకుంటుంది. ఇక్కడ కొద్దిసేపు భోజన విరామం. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద  బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్ , కత్తిపూడి బైపాస్ , తుని బైపాస్ , పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్లకు రాత్రి వరకు చేరుకుంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. సీఎంను కలవడానికి ప్రజలు పోటీ పడ్డారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు సామర్లకోట వద్ద పెద్దాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ బస్సుయాత్రకు జనం ఆత్మీయ స్వాగతం పలికారు. సామర్లకోటలో మిట్టమధ్యాహ్నపు మండుటెండల్లోనూ అభిమానం ఏమాత్రం తగ్గలేదు. మేమంతా సిద్ధమంటూ ముఖ్యమంత్రి కోసం జనం బారులు తీరారు.

పెద్దాపురం పాండవుల మెట్ట వద్ద 12:20గంటలకు బస్సు యాత్ర చేరుకుంది. స్థానికులకు అభివాదం చేసిన సీఎం జగన్‌.. కొద్దిసేపు వారిని కలిసారు. మధ్యాహ్నం 12.37గంటల నుంచి12.48 వరకు సామర్లకోట ఫ్లైఓవర్ పై బస్సు యాత్ర సాగింది. సామర్లకోట ఉన్డూరు క్రాస్ కు 12.48 గంటలకు చేరుకున్నారు సీఎం జగన్‌. సామర్లకోట అచ్చంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద మహిళలు కోరడంతో ముఖ్యమంత్రి జగన్‌ బస్సును కొద్దిసేపు నిలిపివేశారు. కిందికి దిగి మహిళలతో కొద్దిసేపు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్‌.

కాకినాడ జిల్లాలో కొందరు మహిళలు సీఎం జగన్‌ బస్సు యాత్రకు గుమ్మడికాయలతో దిష్టితీసి స్వాగతం పలికారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసుకోవాలని, క్షేమంగా ఉండాలని సీఎం జగన్‌ను దీవించారు.

Back to Top