రాజ‌న్న‌కు గుర్తుగా..జ‌గ‌న‌న్న‌కు తోడుగా

వైయ‌స్ఆర్ జిల్లా:  దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినవారు ఆయనను నిత్యం స్మరించుకుంటున్నారు. వైయ‌స్‌ కుటుంబంపై అంతులేని అభిమానం కనబరుస్తున్నారు. మ‌హానేత‌ను త‌మ గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తూనే, ఆయ‌న కుటుంబానికి అండ‌గా నిలుస్తున్నారు. ఆ కుటుంబం ఎలాంటి యాత్ర చేప‌ట్టినా మేము మీ వెంటే అంటూ తోడుగా నిల‌బ‌డుతున్నారు. ఇలా ఒక్క‌రు ఇద్ద‌రు కాదు..వంద‌లాది మంది వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి తోడుగా పాద‌యాత్ర‌లో అడుగులు వేస్తున్నారు.  అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన నాగరాజు, కళ్యాణదుర్గం మండలం శెట్టూరుకు చెందిన సోమనాథరెడ్డి. వీరికి వైయ‌స్‌ పరిపాలనలో పక్కా ఇళ్లు దక్కాయి. రుణమాఫీ ద్వారా ప్రయోజనం పొందారు. మహానేత మరణంతో రాష్ట్రం అభివృద్ధికి దూరమైందని ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో వైయ‌స్‌ కుటుంబానికి అండగా నిలవాలని భావించారు. ఆ సమయంలో షర్మిల చేపట్టిన పాదయాత్రలో పాల్గొనేందుకు ఇడుపులపాయకు వచ్చారు. కానీ, చూసి వెళ్లిపోలేదు. ఆమె వెంట ఇచ్ఛాపురం వరకు దాదాపు 3,200 కిలోమీటర్లు నడిచారు. ఎన్ని ఇబ్బందులెదురైనా వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్ష నేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపడుతున్నారని తెలుసుకుని నాగరాజు, సోమనాథరెడ్డి సోమవారం ఇడుపులపాయకు చేరుకున్నారు. వైయ‌స్‌ జగన్‌ వెంటే అడుగులో అడుగై నడవాలని నిర్ణయించుకున్నారు. బ్యాగులు సర్దుకుని ఇడుపులపాయ నుంచి యాత్రలో ముందుకు సాగారు. ఇచ్ఛాపురం దాకా వైయ‌స్ జగనన్నకు తోడుగా నిలిస్తామని దృఢంగా చెప్పారు. వీరే కాదు నాడు మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాద‌యాత్రలో పాల్గొన్న కొంద‌రు వ్య‌క్తులు కూడా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో న‌డుస్తున్నారు. 



Back to Top