ప్రీ స్కూల్‌ రికగ్నిషన్ తో తీవ్ర ఇబ్బందులు

తూర్పుగోదావరి : ప్రైవేటు స్కూల్స్‌పై ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల ఒత్తిడులను తట్టుకోలేకపోతున్నామని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద   ప్రెవేటు స్కూళ్ల యాజమాన్య సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా  వారు జననేతను కలిసి వినతి పత్రం అందచేశారు. సంఘ నాయకులు ఇ.గంగాధర్, ఎస్‌.సంతోష్‌ మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లపై ఈ మధ్య ప్రభుత్వ ఒత్తిడులు ఎక్కువయ్యాయన్నారు. గతంలో ఎన్నడూ లేని ప్రీ స్కూల్‌ రికగ్నిషన్‌ కోసం నిబంధనలు జారీ చేసి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారన్నారు.
Back to Top