కాపీ కాట్ లా పప్పేష్


రాజు బన్ గయా జెంటిల్ మేన్ అని సినిమా ఉంది. కాని ఎపి పప్పు మాత్రం పప్పు బన్ గయా కాపీ కాట్ అనిపించుకుంటున్నారు. మాటల్లో తడబాటు ఏదో గ్రహపాటులే అని సరిబుచ్చుకుందామంటే, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడే ప్రతిమాటను, తీరును కాపీ కొట్టేస్తున్నాడు చినబాబు. వైఎస్ జగన్ స్పీచ్ జరిగిన కొద్ది రోజులకే లోకేష్ సభలో మాట్లాడాల్సి వస్తే, అచ్చం ప్రతిపక్ష నేతలాగా మాట్లాడేందుకు చినబాబు తెగ ట్రైచేసేస్తున్నాడు. చంద్రబాబు సినిమా చూపిస్తున్నారని రాజమహేంద్రవరంలో అశేష జనవాహిని ముందు విమర్శించారు వైఎస్ జగన్. అది జరిగిన మర్నాడే పప్పేష్ అనంతపురంలోని ఓ సభలో అవే మాటలను కొద్దిగా మార్చి ఉపయోగించేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీని డ్రామా కంపెనీ అని, మోదీ దర్శకత్వం అని, అమిత్ షా ప్రొడక్షన్ అనీ వాఖ్యానించారు. మాట్లాడటం చేతకాకపోవడం వల్ల ఇలా ప్రతిపక్ష నేతను అనుకరిస్తూ చినబాబు మాట్లాడుతున్నాడేమో అనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. గతంలోనూ పప్పేష్ ఇలాగే జగన్ ను ఇమిటేట్ చేయడం చూసి నెటిజెన్లు తెగ సెటైర్లు వేసారు. వైఎస్ జగన్ స్టైల్ ఆఫ్ స్పీచ్ ను కాపీ కొడితే అయినా తనకు ఫాలోవర్స్ పెరుగుతారని లోకేష్ ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. 

కళ్లముందు తెల్ల ఆవు ఉన్నా నల్ల గేదె అని వాదించే చంద్రబాబు సమర్థతను కూడా ఒంటపట్టించుకుంటున్నాడు లోకేష్. అబద్ధాలను పదేపదే ప్రచారం చేయడం కాదు, వారు చేసిన తప్పులను నిస్సిగ్గుగా ఎదుటివారిమీదకు తోసేయడం నారా కుటుంబానికే చెల్లింది. విభజన సమయంలో కాంగ్రెస్ తో కుమ్మక్కైంది ఎవరో, కాంగ్రెస్ ను ధిక్కరించిందెవరో దేశం అంతా చూసింది. అయినా సరే నవ్విపోయినా గాని నాకేంటి సిగ్గు అనుకుంటూ పచ్చగా పచ్చిగా అబద్ధాలాడేశాడు లోకేష్. వైఎస్సార్ కాంగ్రెస్ అప్పుడు కేంద్రంతో లోపాయికారీ పొత్తు పెట్టుకుని విభజనకు సహకరించిందంటూ నీతిలేని ఆరోఫణలకు తెగబడ్డాడు. మోదీతో కలిసి హోదా రాకుండా అడ్డు పడుతున్నారన్నాడు. ప్రత్యేక హోదా కోసం తొలి నుంచీ పోరాడుతున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసాన్ని పెట్టిన నాయకుడు, హోదా కోసం పదువులు వదులుకున్న ఎంపీలు, హోదా నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన నాయకత్వం అన్నీ కళ్లముందే ఉన్నా లోకేష్ అంత సునాయాసంగా అబద్ధాలు ఆడగలిగాడంటే, ఈ విషయంలో పప్పేష్ తుప్పేష్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నట్టే అని అర్థం అవుతోంది. 
హోదాకంటే ప్యాకేజీ బెస్టు అన్న బాబు, హోదా అంటే జైలుకే అన్న బాబు, నేడు హోదా కోసం ధర్మపోరాటాలంటూ చేస్తున్న నాటకాలను ప్రజలు ఛీ కొడుతున్నారు. హోదా కోసం నిరంతరం ఉద్యమిస్తున్న ప్రతిపక్షానివి డ్రామాలనడం చూస్తేనే పప్పేష్ మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది  అంటున్నారు తెలుగు ప్రజలు. 






  
Back to Top