ఊసరవెల్లుల తపస్సు.....షాక్ తిన్న దేవుడు

అమరావతికి దగ్గరలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతం.....అంతా అల్లకల్లోలం గా ఉంది....ఓం.... ఓం.... అంటూ ...పెద్దగా...గాలి దుమారంతో శబ్దాలు వస్తున్నాయి.

ఇంతలో గుహలో నుండి బయటకు వచ్చిన సింహం గట్టిగా గాండ్రించి....అసహనంగా ఏంట్రా ఆ గోల అంటూ.....అప్పుడే గుహ వైపు వస్తున్న నక్కను  గద్దిoపుగా అడిగింది..

నక్క: ఏముందండి....ఊసరవెల్లులు మూకుమ్మడిగా తపస్సు చేస్తున్నాయి... అందుకే ఇలా...

సింహం:  తపస్సా? ఎందుకు...ఆ రంగుల మారులకు ఏం వచ్చిందట?...పద చూద్దాం అంది...

సింహంతో పాటు అన్ని జంతువులు ఊసరవెల్లులు తపస్సు చేసే చోటుకు చేరుకుంటాయి....
అక్కడ వందల సంఖ్యలో ఊసరవెల్లులు తపస్సు చేస్తుంటాయి...ఓం ఓం అంటూతీవ్రమైన ధ్యానంలో మునిగి ఉన్నాయి ..సింహం గాండ్రించినా బెదరలేదు ...కదలలేదు.

ఇంతలో వాటి తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమవుతాడు....

దేవుడు:  ఊసరవెల్లులారా! ఏమిటి మీ కోరికా? అంటారు...

ఊసరవెల్లుల లీడర్ : స్వామీ మాకున్న ఊసరవెల్లి అనే పేరు మార్చండి! లేదా మాకు రంగులు మారే గుణాన్ని తీసివేయండి....

దేవుడు : అదేంటి ? అది సృష్టి ధర్మానికి విరుద్ధం...మీ కర్మఫలం ప్రకారం మీకు వచ్చింది కదా!...అసాధ్యం!.. ఎందుకిలా అడుగుతున్నారు?

లీడర్: స్వామీ ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఒకాయన తో పోల్చి మమ్మల్ని  పదే పదే తిడుతున్నారు...

దేవుడు : ఎవరితో పోల్చుతున్నారు..

లీడర్:  ఇదిగో చూడండి... (బాబు గారి ఫోటో చూపెడుతూ) ఈయనే   ఊరికే  మాటలు, రంగులు మార్చుతాడట...
ముందు ఎన్టీఆర్ ను గద్దె దింపి కమ్యూనిస్టులతో( ఎర్ర కండువాలు మెడలో ) ....తర్వాత కమ్యూనిస్టు లకు హ్యాండిచ్చి వాజపేయితో (ఫోటోలు కండువాలు చూపాయి)...
మళ్ళీ టిఆర్ఎస్ సీపీఐ సీపీఎం (గులాబీ,ఎర్ర కండువా లు వేసుకుని..కేసీఆర్ ..సీపీఐ సీపీఎం నేతలతో తీయించుకున్న ఫోటోలు)... 
తరువాత మోడీ.. పవన్...
ఇప్పుడు రాహుల్ ,కాంగ్రెస్ కండువాలతో...ఫోటోలు వీడియో క్లిప్పింగ్స్ ఇలా అన్నీ దేవుడికి చూపాయి.

 లీడర్ :ఇంకా కొన సాగిస్తూ...
సామి ఇక మాటలు అంటారా! చూడండి...ఆ గొంతు ఎమందో ?
ఏపీ కి ప్రత్యేక హోదా కావాలన్నది... వద్దు అన్నది...మళ్ళీ కావాలి అన్నది...మోడీని అసెంబ్లీ లో పొగిడింది...తిట్టింది...
కాంగ్రెస్ ను తిట్టింది... పొగుడుతున్నది..హోదా కోసం అవిశ్వాసం పెడితే వైసీపీ కి మద్దతు ఇస్తామని చెప్పి మాట మార్చింది..
ఈవీఎంలు కావాలన్నది ..వద్దంటున్నది...ఇలా రకరకాలుగా మాట్లాడినవన్నీ  వినిపించారు. 

లీడర్: మేము అధికారం కోసం ఆయనలా మాటలు..రంగులు మార్చమా?.. ఏదో మా ప్రాణాలు కాపాడుకోవడానికి తప్ప...
సామీ ! ఆయన బుద్దైనా మార్చండి! లేదా మా పేరు,  లేదంటే మా రంగులు మారకుండా వరమివ్వండి సామీ!అని దీనంగా వేడుకున్నాయి. 

వీటితో షాక్ తిన్న దేవుడు...భక్తులరా నేనేం చేయలేను అని మాయమైపోయాడు.

Back to Top