బీజేపీతో పొత్తు కోసం బాబు వెంపర్లాట

 

బీజేపీ పొత్తుకోసం బాబు ఆరాటం-ఆపని ఆఖరిపోరాటం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్లి, చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, మౌనంగా శ్మశానం వైపు నడిచిన చందమామ కథ విన్నాం...పట్టుతప్పిన అక్రమార్కుడు బీజేపీ వద్దకు తిరిగి వెళ్లి, మోదీ ప్రాపకం సంపాదించి, ఓటుకు నోటు మొదలు లాండ్ మైన్ లాంటి కేసులపై స్టే ఎత్తివేయకుండా కాపాడమని, కాళ్లమీద పడుతున్న చంద్రబాబు కథ చూస్తున్నాం.మోదీ ఏం చెప్పినా నిజమే అంటున్నాడు చంద్రబాబు. బీజేపీ ఏం చేసినా కరెక్టే అంటున్నాడు.అసలు కాషాయంతో నాకేం పేచీ లేదే అని కల్ల'బొల్లి' కబుర్లు చెబుతున్నాడు.ప్రధాని ప్రాపకం కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. 2018 లో ఏపీలో కాలు పెట్టుకుండా చేస్తామన్న మోదీ కాళ్లుపట్టుకోడానికి సిద్ధమైపోయాడు నిప్పునాయుడు.ఉన్న ఎంపీలందర్నీ ప్రసాదంలా సమర్పించినా మోదీ కనీసం కనికరించలేదు. పుట్టినరోజు శుభాకాంక్షలంటూ కళ్లలో పడేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు.బీజేపీతో విబేధించి తప్పు చేసానంటూ బహిరంగ క్షమాపణలు చెప్పినా కన్నెత్తి చూడలేదు. నడిరేతిరి నాగపూర్ లో ఆర్‌.ఎస్.ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ముందు మంతనాలాడినా మోదీ కటాక్షం కలగలేదు.మల్లెపూలు మొదలు మొగలి పూల వరకూ పూలగుత్తులు పంపుతున్నా ఫలితం ఉండట్లేదు.

చెడ తిట్లు తిట్టిన నోటితోనే పొగుడుతూ ప్రస్తుతిస్తున్నా మోదీ పక్కన చేరే సందు దొరకడం లేదు. చివరకి తాను ముఖ్యమంత్రి కాదన్న సంగతే మర్చిపోయి ప్రధాని గారూ శ్వేతపత్రం ఇస్తా నన్ను కాస్త రానీండని సాష్టాంగపడిపోతున్నా ఆ పక్క నుంచి పిలుపు రావడం లేదు...లాభం లేదు ఇక 2020 విజన్ కాదు 420 విజన్ అమలు చేయాల్సిందే అని డిసైడైపోతాడేమో విజనరీ బాబు!!

ఏమంటావ్ లోకేష్...నాన్నారి కాస్త సలహా చెప్పు.

Read Also: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌

 

 

 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top