మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు శైలజా రెడ్డి 

అనంత‌పురం: వైయ‌స్ఆర్‌సీపీ రాజంపేట పార్లమెంట్ సభ్యులు , ఉమ్మడి అనంతపురం జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ని లిక్కర్ స్కాంలో అక్రమంగా అరెస్టు చేశారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మ‌హిళా విభాగం నాయ‌కురాలు శైలజా చరణ్ రెడ్డి  మండిపడ్డారు.  కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి చేయలేక ఇలా ఏదో ఒక విషయంలో ప్రజల్ని మభ్యపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ కాలక్షేపాన్ని చేస్తుంది. ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అరాచకాలు , హత్యలు, అరెస్టులు తో ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే నేడు మిథున్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్ పేరుతో ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ రాజకీయంగా ఎదుగుతున్నారన్న కుట్రతో కావాలని టిడిపి ప్రభుత్వం కక్ష్య గట్టి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్టు చేసింది.

కూటమి నాయకులు గుర్తుపెట్టుకోవాలి అధికారం శాశ్వతం కాదు చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుంది. ఈరోజు మా నాయకుడిని ఏ విధంగా అయితే మీరు అక్రమంగా అరెస్టు చేశారో దానికి రెండింతలు మీరు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నాం అని ఆమె తెలిపారు

మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టిన రాజకీయంగా ఎంత ఇబ్బంది పెట్టిన తట్టుకొని మా నాయకుడు కడిగిన ముత్యంలా బయటికి తిరిగి వస్తాడని తెలియజేస్తున్నాం

చంద్రబాబుని పెద్దిరెడ్డి గారు కాలేజీ రోజుల్లో చెంప దెబ్బ కొట్టారని పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద కక్ష్య గట్టి అక్రమంగా అరెస్ట్ చేయించాడు , పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అడ్డదారిలో ఇతర పార్టీ నాయకులతో చేతులు కలిపి  మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గమైన , పిరికిపంద చర్యగా భావిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా గట్టిగానే బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను.

మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు , రాస్తారోకోలు , సంఘీభావాలు తెలియజేస్తామని హెచ్చరించారు.  కూటమి ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా గట్టిగా ప్రశ్నిస్తామని ఆమె తెలిపారు.

Back to Top