తాడేపల్లి: చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో సహా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ గెలుపు ఖాయమైందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైయస్ఆర్‌సీపీ ఇంఛార్జ్ ల మార్పుపై టీడీపీ-జనసేన పార్టీలు చేసిన విమర్శలకు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ- జనసేన పార్టీలు ముందు వాళ్ళ ఇంటిని వాళ్ళు చక్కబెట్టుకోవాలి అని ఆయన చురకలంటించారు. ఎక్కడ పోటీ చేయాలో.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో.. వాళ్ళకు ఇప్పటికీ స్పష్టత లేదు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మార్పులు చేర్పులు అన్ని అంతర్గత వ్యవహారం.. 2014లో చంద్రబాబు చేసిన తప్పుడు పనులు జనం మర్చిపోయారు అనుకుంటున్నాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేన పార్టీ నేతలువైయస్ఆర్‌సీపీని విమర్శించే ముందు వాళ్ళ ఇంటిని వాళ్ళు చక్కబెట్టుకోవాలని వైయస్ఆర్‌సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలు ఎక్కడ పోటీ చేయాలో, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో వాళ్ళకు ఇప్పటికీ స్పష్టత లేదని అన్నారు.175 స్దానాలలో ఎలా గెలవాలో విజయం సాధించాలంటే ఏమి చేయాలనే క్లారిటీ, స్ర్టాటజీ వైయస్ జగన్ గారికి,మా పార్టీకి ఉందన్నారు. వైయస్ జగన్‌ను లోకేష్ ఇమిటేట్ చేస్తుంటాడంటూ లోకేష్ 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర ఎక్కడ చేశాడో ఎవరికీ తెలియదని అన్నారు. వైయస్ జగన్ చేసిన ప్రజాసంకల్పయాత్ర ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు దోహద పడిందని అన్నారు. అందుకు అది చరిత్రలో నిలిచిపోయిందన్నారు. సమన్వయకర్తలను అంటే నాయకుడిని మార్చితే కింద ఉన్న క్యాడర్ ఇబ్బంది పడటం సహజం అని చెప్పారు. మార్పులు చేసిన చోట వారందర్ని పిలిచి మాట్లాడతామని వివరించారు.చిన్న చిన్న చికాకులను సరిదిద్దటం పెద్ద విషయమేమి కాదని స్పష్టం చేశారు. వైయస్ జగన్ గారు 2019 అధికారంలోకి రావడానికి ముందు ఏది చేయగలమో అది చెప్పి, మేనిఫెస్టోను పవిత్రగ్రంధంగా చూసుకుని ప్రజలలో ఆశీస్సులు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలు చేస్తామని తెలియచేశారు. ఆ తర్వాతనే మేము ప్రజల ఆశీస్సులు కోరతామని ప్రకటించామన్నారు. పరిపాలన అంతా చూస్తే 99.5 హామీలను నెరవేర్చడం జరిగింది. ఇంకా చూసినట్లయితే ,సమన్వయకర్తలతోను,శాసనసభ్యులతో గడపగడపకు రెండేళ్లముందే ప్రారంభింపచేశారు. ప్రజలతో మమేకం చేయడమే కాకుండా ప్రజలకు ఏమి చేశామో చెప్పడం వారికి అన్నీ అందాయా లేదా అనేది కూడా తరచి తరచి చూసేలా కార్యక్రమాలు రూపొందించి అమలు చేశారు. అప్పటినుంచే మొదలైంది. ఎప్పుడైతే ఆ ప్రక్రియ మొదలైందో అప్పుడే వైయస్ జగన్ గారు ఒక్కటి స్పష్టంగా చెప్పారు. ప్రజలలోకి మళ్లీ వెళ్ళేటప్పటికి ప్రజలలో శాటిస్ ఫ్యాక్షన్ స్దాయి, ఎంఎల్ఏ గా మీ పట్ల, ముఖ్యమంత్రిగా నా పట్ల ఎలా ఉందో తెలుస్తూ వస్తే ఇందులో వాటిని నెెక్ట్స్ అభ్యర్దిని నిర్ణయించేటప్పుడు ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు. ఇందులో అందరూ నాతోపాటు ఉండాలని కోరుకుంటున్నాను. మాతోపాటు అసెంబ్లీకి రాలేని 23 మందితో కలసి 175 మంది కావాలని అనుకుంటున్నాను అని కూడా తెలియచేశారు. ఎవ్వరూ కూడా వేరే విధంగా ఆలోచించవద్దు. అల్టిమేట్ గా ప్రజలకోసం మార్పులు కూడా చేస్తామని..... చేయాల్సి ఉంటుందని కూడా స్పష్టంగా శాసనసభ్యులకు, సమన్వయకర్తలకు తెలియచేశారు. అందులో భాగంగా ఇది నిరంతరంగా జరుగుతుంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అచరణలో మార్పులు,చేర్పులు జరుగుతూ వస్తాయన్నారు. ఇవి జరిగేటప్పుడు మరింత మెరుగైన మెజారిటీతో గెలుపు, అలాగే ప్రజలకు యాక్సెప్టబులిటి ఉందా లేదా..... దానిపై అభ్యర్దులలో మార్పులు చేర్పులు....లేదా వారే కంటిన్యూ కావడం నిర్ణయిస్తారు. వైయస్ జగన్ గారు బలంగా విశ్వసించే రాజకీయసాధికారిత దిశగా బలహీనవర్గాలకు,మహిళలకు ప్రాతినిద్యం పెరిగే అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ ఆలోచన చేయడం జరుగుతూ వస్తోంది అని అన్నారు. దీనిని చూసి అప్పుడే టిడిపి,జనసేన లు బెంబేలు ఎత్తుతూ ప్రజలలో అయోమయం సృష్టించేందుకు 80 మందిని మారుస్తున్నారు...90 మందిని మారుస్తున్నారంటూ ప్రచారం ప్రారంభించారు. ముందు టిడిపి జనసేనలు వాళ్ళ ఇళ్లు వాళ్లు చక్కబెట్టుకుంటే బాగుంటుంది.వారికి ఇళ్ళు లేదు.స్రక్టర్ లేదు.వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న తర్వాత ఇన్నాళ్ళు నెట్టుకుంటూ వచ్చారు.టిడిపి శిధిలావస్ధకు చేరిన సౌధం. పవన్ కల్యాణ్ ను నమ్ముకుని ప్రయత్నం చేస్తున్నాడు అందులో ఎవరికి ఎన్ని సీట్లోతెలియదు. వారికిస్తే వీరు ఉండమని ఒకరికి ఒకరు అనుకుంటున్నారు. జగన్ గారు కొత్తతరం ఆశలు తీర్చే నాయకుడిగా,రాష్ర్టానికి మంచి భవిష్యత్తును ఇచ్చే నేతగా బలమైన నేతగా అడుగులు వేస్తున్నారు. అందరి జీవితాలలో మార్పులు కూడా వస్తున్నాయి. ఇది వైయస్ఆర్‌సీపీ బలం. మా పార్టీలో మార్పులు చేసినందువల్ల చంద్రబాబుకు లాభం అయితే ఇంక ఏఢుపులు ఎందుకు అని ఎద్దేవా చేశారు. ముసలం, ఎత్తిపోయారు, అయోమయం అంటూ పచ్చమీడియాలో హెడ్డింగ్ లన్నీ అవే పెట్టారు. విషయం ఏమంటే వైయస్ జగన్ గారి వైఖరి బలంగా, నిబ్బరంగా, ధీమాగా ఉంది. ప్రజల యాక్సెప్టబులిటి పొందడానికి, ప్రజల బ్లెస్సింగ్స్ కోరడానికి 175 మంది అభ్యర్దులతో ముందుకు వెళ్ళే ప్రక్రియ మా పార్టీ మొదలుపెట్టింది అది మొదలైంది. దానికి వాళ్ళు బెంబేలు ఎత్తున్నారని అన్నారు. బిసి స్దానాలలో మాత్రమే మార్పులు చేస్తున్నారంటూ చేసిన విమర్శలను సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టి పారేశారు.