వాలంటీర్ల వ్యవస్థతో నేరుగా లబ్ధిదారుల ఇంటికే సంక్షేమం

వాలంటీర్లు స్వచ్చంధ సేవకులు

గతంలో జన్మభూమి కమిటీల గురించి అందరికీ తెలుసు

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

అవినీతికి తావులేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వాలంటీర్లు డోర్‌ డెలివరీ చేసుతన్నారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.  వాలంటీర్ల వ్యవస్థతో నేరుగా లబ్ధిదారుల ఇంటికే సంక్షేమం అందుతుందన్నారు.  వాలంటీర్‌ వ్యవస్థ మీద దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోమ‌వారం ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో నవరత్నాలు బాగా అమలవుతున్నాయని, ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్‌ గారికి మంచిపేరు వస్తుందని ఇలాంటి విషపు రాతలు రాస్తున్నారు. వాలంటీర్‌ వ్యవస్థను మేం పార్టీ ప్రయోజనాలకు వాడుకోవాల్సిన అవసరం ఏముంది...? గత పదేళ్లలో క్షేత్ర స్థాయిలో మా పార్టీ బలోపేతంగా ఉంది. మా నాయకుడు వైయ‌స్‌ జగన్‌ పార్టీని అలా తీర్చిదిద్దారు. ప్రతి బూత్‌ స్థాయి నుంచి గ్రామ, మండల స్థాయి వరకూ మాకు శాస్త్రీయంగా ప్రతినిధులు ఉన్నారు. దానికి నిదర్శనమే మొన్నటి ఎన్నికల ఫలితాలు. పార్టీ బలోపేతానికి ఎప్పటికప్పుడు మా నాయకుడు వైయ‌స్‌ జగన్‌ దిశానిర్ధేశం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ వాడుకోవాల్సిన అవసరం మాకు లేదు. చంద్రబాబు నాయుడు తన పార్టీ కోసం వాడుకున్నంతగా ఈ దేశంలో ఎవరూ వాడుకుని ఉండరు.  అన్ని అర్హతలు ఉన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి చంద్రబాబు హయాంలో ఉండేది. జిల్లా కలెక్టర్లకు సైతం చూసీ చూడనట్లు పోవాలంటూ ఆదేశాలు ఇచ్చిన దిక్కుమాలిన పాలన చంద్రబాబుది. 
వికేంద్రీకరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం, దానికి అనుబంధంగా వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని గడప వద్దకు మేం పాలన అందిస్తున్నాం. 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహ సారథులను ఏర్పాటు చేయాలని మా నాయకుడు  వైయ‌స్‌ జగన్‌ మొన్ననే చెప్పారు. ప్రతి ఒక్క  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్త ఒక సైనికుడిలా పార్టీ బలోపేతానికి పనిచేస్తారు తప్ప ఒకరిని వినియోగించుకోవాల్సిన అవసరం లేదు.  
    నెలకు టీడీపీ 400 కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేస్తే మేం రూ.1600 కోట్లు ఖర్చు చేస్తున్నాం. టీడీపీ హయాంలో 39 లక్షల మందికి పింఛన్లు ఇస్తే, ఈరోజు మనందరి ప్రభుత్వం 62.70 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. మేం ఏటా సుమారు 18వేల కోట్లు కేవలం పింఛన్లపైనే ఖర్చు చేస్తున్నాం.సూర్యోదయానికి ముందే ఈ పింఛన్లను గడప గడపకు చేరుస్తున్నది వాలంటీర్లే. బాబు బుర్ర తక్కువ పరిపాలన అమోఘం, అద్భుతం అంటూ బుర్రకథలు చెప్పడానికి ఇలాంటి వికృత రాతలు రాస్తున్నారు. వాలంటీర్‌ వ్యవస్థలో అన్ని పార్టీల వారున్నారు. కేవలం సేవా దృక్పదంతో పనిచేసే వారిని మాత్రమే మేం ఎంపిక చేస్తున్నాం.  

 ప్రతిపక్షంలో ఉండగా ఒకలా.. అధికారంలో ఉండగా చంద్రబాబు మరోలా వ్యవహరిస్తారని మండిపడ్డారు. సమైక్యం కోసం నిలబడ్డ ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని స్పష్టం చేశారు. విభజన జరిగిన పద్ధతి సరిగా లేదన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రాకుండా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతులకు అండగా ఉంటున్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అంకితమైన పార్టీ అని, వైయస్‌ జగన్‌ సొంతంగా ప్రజల అభిమానం చూరగొనాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష అని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు.

Back to Top