ఎరువుల కొరతను పరిష్కరించడంలో ఘోర వైఫల్యం

కూటమి సర్కార్‌పై మండిపడ్డ వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్‌కుమార్

తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్.

రాష్ట్రంలో కనీసం ఎరువులను కూడా అందించలేని అసమర్థ ప్రభుత్వమిది

ఎరువుల కోసం రైతులు రోడ్డెక్క పరిస్థితి తెచ్చారు

సీజన్ ప్రారంభమైనా ఎక్కడ ఎరువులు దొరకడం లేదు

వ్యవసాయాన్ని దండగ చేయాలన్నలదే సీఎం చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది

వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్‌కుమార్ ఆగ్రహం

తాడేపల్లి: రాష్ట్రంలో రైతాంగానికి కనీసం అవసరమైన ఎరువులను అందించడం లోనూ చంద్రబాబు నేతృత్వం లోని కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయలో మీడియాతో మాట్లాడుతూ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇంకా ఎరువుల కోసం రైతులు ఎదురుచూడాల్సిన దారుణమైన పరిస్థితిని కల్పించారని మండిపడ్డారు. ఆర్బీకేల వంటి మంచి వ్యవస్థలతో గత వైయస్ఆర్‌సీపీ తీసుకువచ్చిన రైతు అనుకూల విధానాలను చంద్రబాబు అధికారంలోకి రాగానే సర్వనాశనం చేశాడని ధ్వజమెత్తారు. నేడు ఎరువులు కావాలంటూ రైతులు రోడ్డెక్కే పరిస్థితికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణం ఎరువుల లభ్యతపై దృష్టి పెట్టకపోతే రైతుల పక్షాన వైయస్ఆర్‌సీపీ పోరాటానికి సిద్దమవుతుందని హెచ్చరించారు. ఇంకా ఆయనేమన్నారంటే...

బ్లాక్ మార్కెట్ లో ఎరువులు - పట్టని ప్రభుత్వం:

ఇవాళ రాష్ట్రంలో రైతులెవ్వరికీ ఎరువులు అందడం లేదు. గతంలో పీఏసీఎస్ ద్వారా ఎరువులు అందించే కార్యక్రమం జరిగేది. ఇవాళ అధికార పార్టీ నేతలకు తప్ప మిగిలిన వారికి అందడం లేదు. యూరియా రూ.265 ఉంటే బ్లాక్ మార్కెట్ లో రూ.300 నుంచి రూ.320 వసూలు చేస్తున్నారు. ఇక ప్రయివేటు షాపుల్లో అయితే అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. రైతులకు యూరియా ఇవ్వాలంటే.. వారు రూ.2వేలు కొనుగోలు చేయాలని నిబంధనలు పెడుతున్నారు. వ్యవసాయశాఖ మంత్రికి దీని గురించి కనీస పర్యవేక్షణ లేదు. రెండు నెలల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. 2024 డిసెంబరు 8న యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు, 23-03-2025 ఎరువుల్లేవు, 31-05-2025 ఇస్తామన్నామా అని, 11-07-2025 బారుల తీరు నిల్చుంటేనే ఎరువులు, యూరియా కోసం యాతన అంటూ వరుసగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకసార్లు ఎరువుల కొరత, రైతుల ఆందోళన అంటూ పత్రికల్లో వార్తలు వస్తున్నా.. ముఖ్యమంత్రికి, వ్యవసాయశాఖ మంత్రికి, కలెక్టర్లు రైతులుకు ఎరువులు అందించాలన్న ఆలోచనే లేదు. బ్లాక్ మార్కెట్ మాత్రం విపరీతంగా ఉంది. రైతులు నష్టపోయినా సాగు చేయడం ఆపరు. కానీ ప్రభుత్వం ఆదుకోకపోవడం వల్ల మరలా ప్రయివేటు వడ్డీ వ్యాపారస్తులను అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రజలతో కలిసి పోరాటం: 

రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎరువులు అందుబాటు లోకి తీసుకువచ్చి, బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేసారు. ప్రభుత్వమే రైతుల తరపున ఉచిత ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో సంబంధం లేకుండా కూటమి పార్టీలు ఇస్తామన్న రూ.20, గతేడాది బకాయి రూ.20 వేలు కలిపి రూ.40 వేలు ప్రతి రైతుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవాల అన్ని జిల్లాల కలెక్టర్లకు రైతు సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి చేస్తున్నాం.. వాటిని పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని అనిల్ కుమార్ హెచ్చరించారు.

కక్షతో ఆర్బీకేల నిర్వీర్యం

వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రైతుల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను కక్షపూరితంగా చంద్రబాబునాయుడు నిర్వీర్యం చేశారు. కేవలం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఉన్న మంచి పేరును చెరిపేయాలన్న కుట్రతో.. గ్రామాల్లో రైతులకు విత్తనాలు, ఎరువులు ఇంటి వద్దకే సరఫరా చేస్తూ వారిని చేయిపట్టుకుని నడిపించిన ఆర్బీకేలను నిర్లక్ష్యం చేస్తున్నారు.  గతంలో వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రూ.3వేల కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధిని కూడా తీసివేశారు. ధాన్యం, మినప రైతులు మద్ధతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్న ఏ రైతు నాకు రైతుభరోసా అందలేదని కానీ, ఎరువులు, విత్తనాల కోసం రోడ్డెక్కాల్సిన అవసరం కాని ఏ రైతుకు లేకుండా పోయింది. ఉచిత పంటల బీమా ఆ రోజు అమలు చేస్తే... ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులతో బలవంతంగా ఇన్సూరెన్స్ కట్టించుకుంటున్నారు. వరికి ఎకరాకు రూ.800, పసుపు రైతులకు ఎకరాకు రూ.1200 కట్టించుకుంటున్నారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తే వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఇన్ పుట్ సబ్సిడీ అందించారు. అందుకు భిన్నమైన పాలన కూటమి ప్రభుత్వ హయాంలో నడుస్తోంది. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతులకు మేలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటూ... పొలాల్లో సినీ సెట్టింగ్ వేసి రైతులను ఎండలో కూర్చోబెట్టారు. మేనిఫెస్టోలో రైతులకు రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఎగరగొట్టారు. రెండో ఏడాది కూడా రైతులకు కేవలం రూ.5వేలు మాత్రమే ప్రకటించి అందులోనూ అనేక ఆంక్షలు విధించారు.దాదాపు 7 లక్షల మంది లబ్దిదారులకు ఈ పథకంలో కోత విధించారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో కౌలురైతులకు కూడా రైతు భరోసా ఇస్తే.. కూటమి ప్రభుత్వంలో వారికి మొండి చేయి చూపించింది. దీనిపై వైయ‌స్ఆర్‌సీపీ ప్రశ్నిస్తే... రానున్న వాయిదాలో వారికి ఇస్తామని చెబుతోంది. ఇదే కార్యక్రమం ప్రారంభోత్సవంలో చంద్రబాబు తన మనసులో మాట చెప్పకనే చెప్పారు. తాను ఉన్నంత వరకు రైతులకు న్యాయం జరగనే జరగదని వేదికపైనే స్పష్టం చేశారు.

Back to Top