చంద్రబాబువి ఉత్తరకుమార ప్రగల్భాలు..

కాపులకు బీసీ సర్టిఫికెట్లు ఇప్పించగలరా..

రుణాంధ్రప్రదేశ్‌గా చంద్రబాబు మార్చేశారు..

కాపుల ద్రోహి చినరాజప్పే..

జగన్‌ అనే భయంతోనే చంద్రబాబు దీక్షలు..

వైయస్‌ఆర్‌సీపీ నేత పేర్ని నాని...

విజయవాడ: ఏపీకి ప్రత్యామ్నాయం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒకరేనని వైయస్‌ఆర్‌సీపీ నేత పేర్ని నాని అన్నారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ నాయకత్వం పట్ల నమ్మకంతోనే వ్యక్తిగత ఇమేజ్‌ ఉన్న నాయకులు టీడీపీని వీడి వైయస్‌ఆర్‌సీపీలోకి వస్తున్నారని తెలిపారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వం రాకపోతే  భవిష్యత్తులో  రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి సంగతి దేవుడెరుగు..రుణాంధ్ర ప్రదేశ్‌గా మారిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశ్యంతో వ్యక్తిగత ఇమేజ్‌ ఉన్న టీడీపీ నాయకులు వైయస్‌ జగన్‌ వైపు చూస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల్లో పాతుకుపోయిందని చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు. నిజంగానే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో పాతుకుపోతే.. ఏడాది కిత్రం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రూపొందించిన నవరత్నాలను..చంద్రబాబు ఎందుకు దొంగిలించాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

చంద్రబాబు నేడు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు.ఐదేళ్లు అవినీతి మత్తులో జోగుతూ..నేడు జగన్‌ అనే భయంతో ఎన్నికల సమీపంలో బీసీ కులాల కార్పొరేషన్ల పేరుతో అమలు కాని జీవోలు ఇస్తున్నారన్నారు. డ్వాక్రా రుణమాఫీ పేరు చెప్పి అధికారం దండుకుని...నేడు జగన్‌ అనే భయంతో కల్తీ పుసుపు–కుంకమ ఇచ్చింది వాస్తవం కాదా...అని ప్రశ్నించారు. రూ.2 వేల పెన్షన్‌ను వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నవరత్నాలలో ప్రకటించారని..ఇవాళ ఎన్నికల నెల ముందు పెన్షన్‌ పెంపు..పెద్ద పెను మాయగా గుర్తించబట్టే..నేడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు వైయస్‌ జగన్‌ వైపు చూస్తున్నారన్నారు. చంద్రబాబు..రూ.14 కోట్ల ప్రజాధనం  దుర్వినియోగం చేసి..ఢిల్లీ వీధుల్లో అధర్మపోరాటాలు చేయడం జగన్‌ అనే భయంతో కాదా అని ప్రశ్నించారు.హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న నాయకులను కేసీఆర్‌ బెదిరించడం వల్లనే వైయస్‌ జగన్‌ వద్దకు చేరుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు.‡టీడీపీలో సీట్లు ఇవ్వకపోవడం వల్లనే  వైయస్‌ఆర్‌సీపీలోకి  చేరుతున్నారనే లోకేష్‌ వ్యాఖ్యలనూ ఖండించారు.

చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేష్‌ మాటలకు సమన్వయం లేదన్నారు.ఇరువురూ వేర్వేరు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరూ కూర్చోని ఏదీ వాస్తవం అని తేల్చుకోవాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వ్యాఖ్యలను ఖండించారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప తీరు వెర్రి వెంగళప్పలా ఉందని ఎద్దేవా చేశారు. పిల్లి కళ్లు మూసుకుని దొంగతనంగా పాలు తాగుతూ ఎవరు చూడటం లేదు కాదా అన్నట్లుగా రాజకీయ కాపురాలు నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.కాపులకు ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే..అది అసలు సిసలైన ఉప ముఖ్యమంత్రి చినరాజప్పేనని అన్నారు. అవంతి,ఆమంచి కాపు ద్రోహులన్ని చినరాజప్ప మాట్లాడుతున్నారని.. కాపు కులాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టిన వ్యక్తి చినరాజప్ప అని అన్నారు.

కాపులను బీసీలను చేశామని దండలు వేయించుకుని,స్వీట్లు తినిపించుకుని..చంద్రబాబుకు నమస్కారాలు పెట్టారని..నేడు కాపులకు ఏంచేశారని ప్రశ్నించారు.. కాపులకు బీసీ సర్టిఫికెట్లు ఇప్పించగలరా అని ప్రశ్నించారు.ఎన్నికల తరుణంలో కాపులను ఓబిసి చేశామని తీర్మానం చేశారని..మళ్లీ చినరాజప్ప..చంద్రబాబుకు శాలువాలు కప్పి సన్మానాలు చేశారు..ఇంతకి కాపులు బీసీలా..ఓబీసీలా అని ప్రశ్నించారు. దీనిపై  స్పష్టత ఇవ్వలేని స్థితిలో చినరాజప్ప ఉన్నారన్నారు. దీని బట్టి కాపులంటే చంద్రబాబుకు ఎంత చులకన భావనో అర్థమవుతుందన్నారు.

పార్టీ మారినవారంతా రాజకీయ పరిపక్వత లేని వారంటూ కళా వెంకట్రావ్‌ వ్యాఖ్యలను ఖండించారు. 2009లో కళా వెంకట్రావ్‌ ఏమి చేశారో గుర్తుచేసుకోవాలన్నారు.కళా వెంకట్రావ్‌కు ఏమి పరిపక్వత ఉందని పీఆర్పీలో చేరారు అని ప్రశ్నించారు.అనంతరం మళ్లీ తెలుగుదేశంలోకి గోడ దూకారని..అది రాజకీయ పరిపకత్వమా అని ఎద్దేవా చేశారు. రాజకీయం కోసం గడ్డి కరుస్తున్నారని మండిపడ్డారు. మీ సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడిని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకునేటప్పుడు..చివరి క్షణం దాకా కూడా..రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న మీకు తెలియని విధంగా అవమానాలు జరుగుతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా ఆత్మగౌరవం లేని జీవితాన్ని గడుపుతున్నారన్నారు.

తాజా వీడియోలు

Back to Top