తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ యాదవ్, నాగార్జున యాదవ్ లు ఇంకా ఏమన్నారంటే..: ఇది కేవలం కుట్ర మాత్రమే. లేని కేసు సృష్టించి, ఉద్దేశపూర్వకంగా వైయస్ఆర్‌సీపీ నాయకులను వేధిస్తున్నారు. ఇప్పుడు నాడు మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కొడుకు కారుమూరు సునిల్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు అన్నీ పారదర్శకంగా జరిగాయి. అక్రమ మద్యాన్ని పూర్తిగా నియంత్రించడం జరిగింది. మద్యం షాప్‌లు తగ్గించడంతో పాటు, ప్రభుత్వమే స్వయంగా వాటిని నిర్వహించింది. పర్మిట్‌రూమ్‌లు, బెల్టుషాప్‌లు పూర్తిగా రద్దు చేశాం. అయినా లేని మద్యం కేసు సృష్టించి, ఆ కేసులో పార్టీ పెద్దలను ఇరికించే కుట్ర చేశారు. ఇద్దరు మాజీ ఉన్నతాధికారులను అన్యాయంగా జైల్లోనూ ఉంచారు. మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి, మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ, కేసు బనాయించి, ఆయన కొడుకు కారుమూరు సునిల్‌ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. దీన్ని పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజానికి 2014–19 మధ్య మద్యం సరఫరా, విక్రయాల్లో నాటి సీఎం చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశారు. బార్లకు మేలు చేస్తూ, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి, ఖజానాకు గండి కొట్టారు. ఎంపిక చేసిన డిస్టిలరీల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేశారు. ఇంకా అప్పుడు మద్యం షాపులన్నీ టీడీపీ సిండికేట్‌వే. వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు, ఊరూరా, వాడవాడనా బెల్టుషాప్‌లు. ప్రతి చోటా ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయాలు. అంతా అధికారపార్టీ నేతల జేబుల్లోకే. మద్యం ఎక్కువ విక్రయాలు జరిగినా ప్రభుత్వ ఆదాయం పెరగలేదు. మద్యం సరఫరా, విక్రయాల్లో అక్రమాలపై చంద్రబాబుపై ఆ తర్వాత కేసు కూడా నమోదైంది. అధికారంలోకి రాగానే, ఆ కేసును ఎలాగైనా మాఫీ చేసుకోవడంతో పాటు, దాన్నుంచి అందరి దృష్టి మళ్లించడం కోసం, మా ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాల్లో అక్రమాలు జరిగాయంటూ లేని కేసు సృష్టించి, మా పార్టీ నాయకులను వేధిస్తున్నారు. ఇది అత్యంత హేయం. ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నాం.