ఉత్తరాంధ్రలో సిద్దం సభకు ఊహించని రెస్పాన్స్

వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌ వైవీ సుబ్బారెడ్డి

విశాఖ‌: ఉత్తరాంధ్రలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్వ‌హించిన‌  సిద్దం సభకు ఊహించని రెస్పాన్స్ వ‌చ్చింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరో మూడు సభలను నిర్వహిస్తామ‌న్నారు. ఏలూరు, అనంతపురంతో పాటు నెల్లూరు లేదా ఒంగోలులో ఇంకో సభ ఉంటుంద‌ని చెప్పారు. సీఎం వైయ‌స్‌ జగన్ కార్యకర్తలను స్వయంగా కలిసి ఎన్నికలకు సిద్దం చేస్తున్నార‌ని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం అనేది సీఎం వైయ‌స్ జగన్‌కి రెండు కళ్లు లాంటివి అన్నారు. గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు విజన్ కేవలం తన వారిని అభివృద్ధి చేసుకోవటమే అని విమ‌ర్శించారు. అమరావతి అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రజలతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కచ్చితంగా మూడు రాజ్యసభ సీట్లను కైవసం చేసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. చంద్రబాబు చేసే కుట్రలు ఫలించవని, మా ఎమ్మెల్యేలంతా మావైపే ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు.

Back to Top