పర్యావరణ ప‌రిర‌క్ష‌ణ అందరి బాధ్యత 

ఈకో వేడుక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి

విశాఖ‌:  పర్యావరణాన్ని పరిరక్షించడం, పెంపొందించుకోవడంలో మన అందరి బాధ్యత అని  వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. విశాఖపట్నం బీచ్ రోడ్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణహిత జీవన శైలి మిషన్ లైఫ్ పోస్టర్ ను, పర్యావరణ దినోత్సవ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం  పర్యావరణ వనరులను కాపాడటం.. పర్యావరణ సంరక్షణకు అనుకూల పద్ధతులను ప్రోత్సహిస్తోంద‌న్నారు.  ఇందులో భాగంగా మొక్క‌లు నాటడం, వ్యర్థాలను తగ్గించడం లేదా పునరుత్పాదక శక్తిని అందించడం వంటివి చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పర్యావరణ అభివృద్ధిపై అవగాహనను పెంచుతుంద‌న్నారు.  ప్రపంచ పర్యావరణ వేడుకల్లో విజయనగరం పార్లమెంట్ సభ్యులు  బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), శాసన మండలి సభ్యులు  పెనుమత్స సూర్యనారాయణ రాజు(సురేష్ బాబు) , ఇందుకురి రఘురాజు , త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top