నాసిరకం మరమ్మత్తుల వల్లే గుంటూరు ఛానల్‌కు గండి

వైయ‌స్ఆర్‌సీపీ పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త  అంబటి మురళీకృష్ణ 

గుంటూరు:  గుంటూరు ఛాన‌ల్‌కు నాసిర‌కంగా మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్ట‌డం వ‌ల్లే గండి ప‌డింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త  అంబటి మురళీకృష్ణ మండిప‌డ్డారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలు కారణంగా  కాకాని నుంచి గోళ్ళమూడి వెళ్లే రోడ్డులో గల గుంటూరు ఛానల్ కు  గండి ప‌డ‌టంతో అంబ‌టి ముర‌ళీకృష్ణ‌, వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు సంఘ‌ట‌న స్థ‌లాన్ని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..గుంటూరు ఛాన‌ల్‌కు ఆరు నెలల క్రితం కూటమి ప్రభుత్వంలో నాసిరకం మరమ్మత్తులు చేప‌ట్టింద‌న్నారు. క‌మీష‌న్ల క‌క్కుర్తితో మ‌ర‌మ్మ‌త్తు ప‌నుల‌ను నాసిర‌కంగా చేప‌ట్ట‌డంతో ఇంత‌టి న‌ష్టం చ‌విచూడాల్సి వ‌చ్చింద‌న్నారు. కాల్వ నీళ్ల‌న్ని పంట పొలాల‌ను ముంచెత్త‌డంతో రైతులు సాగు చేసిన పైర్లు నీట మునిగాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం వెంట‌నేస్పందించి న‌ష్ట‌పోయిన ప్ర‌తి రైతును ఆదుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

Back to Top