మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావుకు వైయ‌స్ఆర్‌సీపీ ఘన నివాళి

మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావుకు వైయ‌స్ఆర్‌సీపీ ఘన నివాళి

తాడేపల్లి : మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ జక్కంపూడి రామ్మోహన్‌రావు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రామ్మోహన్‌రావు ప్రజా జీవితంలో అందించిన విశిష్ట సేవలను శ్రీ వైఎస్ జగన్ స్మరించుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన చూపిన చొరవ, ప్రజలతో మమేకమై పనిచేసిన తీరును గుర్తు చేశారు. వైఎస్సార్ కుటుంబంతో జక్కంపూడి రామ్మోహన్‌రావుకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన నాయకుడిగా జక్కంపూడి రామ్మోహన్‌రావు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని శ్రీ వైఎస్ జగన్ అన్నారు. ప్రజల పట్ల ఆయన చూపిన సేవాభావం, నిబద్ధత భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు, పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, నేతలు పాల్గొని జక్కంపూడి రామ్మోహన్‌రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
 

Back to Top