జాతీయ ర‌హ‌దారులుగా అప్‌గ్రేడ్ చేయాలి

కేంద్ర మంత్రి నితీన్ గ‌డ్కారీకి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల విన‌తి

న్యూఢిల్లీ: రాష్ట్రంలోని పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలంటూ.. కేంద్ర  మంత్రి  నితీన్ గడ్కరీకి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు విన‌తిప‌త్రం అంద‌జేశారు. మంగ‌ళ‌వారం ఢిల్లీలోని గ‌డ్కారీ కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత  వి. విజయసాయిరెడ్డి, లోక్ సభ  పక్ష నేత మిథున్ రెడ్డి, పార్టీ ఎంపీలు మంత్రిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలోని ర‌హ‌దారుల‌పై చ‌ర్చించారు. జాతీయ ర‌హ‌దారుల‌గా రాష్ట్రంలోని రోడ్ల‌ను అప్‌గ్రేడ్ చేయాల‌ని వారు కోరారు. మంత్రిని క‌లిసిన వారిలో ఎంపీలు పిల్లి  సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, వంగా గీతా, జీ. మాధ‌వి, స‌త్య‌వ‌తి,  ఎమ్మెల్యేలు క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ‌, ఉమా శంక‌ర్ గ‌ణేష్ త‌దిత‌రులు ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top