ప‌ప్పుశ‌న‌గ రైతుల‌కు అండగా సాకే శైలజానాథ్ 

పుట్లూరులో రైతన్నలతో కలిసి నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌, ధర్నా  

అనంత‌పురం:  ప‌ప్పుశ‌న‌గ రైతుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు, మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్ అండ‌గా నిలిచారు.  రైతుల‌కు స‌బ్సిడీపై విత్త‌నాలు పంపిణీ చేయాల‌ని డిమాండ్ చేస్తూ పుట్లూరులో రైతుల‌తో క‌లిసి నిర‌స‌న ప్ర‌దర్శ‌న చేప‌ట్టి, ధ‌ర్నా చేశారు. ఏపీ సీడ్స్ అధికారుల‌తో డాక్టర్ సాకే శైలజానాథ్  ఫోన్ కాల్ లో మాట్లాడి ఎందుకు  రైతన్నలకు పప్పు శనగ పంపిణీ చేయలేదని ప్రశ్నించడంతో  వ్యవసాయ అధికారులు ఇండెంట్ పంపలేదని సమాధానం ఇచ్చారు. దీంతో అధికారుల తీరుపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి , రైతు విభాగం నాయ‌కులు తరిమెల గోకుల్ రెడ్డి, మడుగుపల్లి నాగేశ్వరరెడ్డి, రాష్ట్ర వాలంటీర్ కార్యదర్శి ఇల్లూరు జయరామిరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు పట్నం ఫణీంద్ర,మాజీ కన్వీనర్ నాగేశ్వరావు, మడ్డిపల్లి సుధాకరెడ్డి, కడవకల్లు విశ్వనాథ్ రెడ్డి, అరటివేముల శ్రీనివాసరెడ్డి, ఎల్లుట్ల శేఖర్, దోసలేడు నరసింహారెడ్డి, శివారెడ్డి, జిల్లా యువజన నాయకులు సోహైల్, గవ్వల సాయి తదితరులు పాల్గొన్నారు

Back to Top