వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు..క‌దిలిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌ స‌హాయ‌క చ‌ర్య‌లు

బాధితుల‌కు అండ‌గా వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు 

తాడేప‌ల్లి: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల‌కు అండ‌గా నిల‌వాల‌న్న వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు పార్టీ శ్రేణులు క‌దిలారు.  ప్ర‌భావిత ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా తుపాను తర్వాత  నెలకొన్న ప­రి­స్థి­తులు, పంట నష్టం వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.  క్షేత్రస్థాయిలో చురుగ్గా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడంలో, వారి­కి ఆహారం అందించడంలో సేవలందించారు.  తుపానువల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థా­యిలో పర్యటించి నష్టపోయిన బాధితు­లకు భరోసా ఇస్తూ.. వివ­రాలను సేకరించారు.  


 శ్రీ‌కాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని సీతాపురం–బొడ్డాపాడు పరిధిలో  తుపాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా బెండుగడ్డ నుండి వచ్చే వరద నీరు పంటపొలాల్లోకి చేరి సుమారు 200 ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. ఈ పంటల‌ను మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ప‌రిశీలించారు.  నష్టపోయిన ప్రతి రైతుకూ తక్షణ నష్టపరిహారం చెల్లించాలని, అలాగే  ఇన్‌పుట్‌ సబ్సిడీ పూర్తి స్థాయిలో అందించాల‌ని సీదిరి అప్ప‌ల‌రాజు డిమాండ్ చేశారు.  

ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం నియోజకవర్గం పెద్ద దోర్నాల మండలం పెద్ద బొమ్మలపురం గ్రామంలో తుపాన్  ప్రభావిత ప్రాంతాలను  ఎమ్మెల్యే  తాటిపర్తి చంద్రశేఖర్ ప‌రిశీలించారు.

అరకు వ్యాలీ మండలం ఇరగాయి పంచాయతీలో  మొంధా తుపాన్ కారణంగా పడిపోయిన ఎంపీపీ స్కూల్ భవనం,  పూజారి బుద్దు, పూజారి నాగేష్  ఇళ్ల‌ను అరకు ఎమ్మెల్యే మత్స్య లింగం, జడ్పిటిసి స‌భ్యురాలు శెట్టి రోషిణి, యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేగం చాణక్య ప‌రిశీలించారు.

చీరాల నియోజ‌క‌వ‌ర్గం కొత్తపాలెం గ్రామంలో ముంపు బాధిత 110 కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఐదు కేజీల బియ్యాన్ని వైయ‌స్ఆర్‌సీపీ యూత్ నాయ‌కుడు కావూరి బాలకోటి రెడ్డి, కావూరి శివారెడ్డి అంద‌జేశారు

కనిగిరి నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్  దద్దాల నారాయణ యాదవ్  కలగట్ల రోడ్డు లో తుపాన్ ప్రభావితం వలన నీట మునిగిన కంది పంట పొలాలను పరిశీలించారు.  అకాల వర్షం వలన నియోజకవర్గం లో కంది, సజ్జ, వరి, పొగాకు ఇతర పండ్ల తోటలకు నష్టం జరిగిందని నారాయ‌ణ తెలిపారు. రైతుల‌ను ఆదుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.   

పాడేరు ఘాట్ రోడ్డుపై విరిగిపడిన కొండచరియల‌ను ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు ప‌రిశీలించారు.   పాడేరు, చోడవరం వెళ్లే రాకపోకలకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖ, అటవీ శాఖ అధికారుల‌ను ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు కోరారు. 

ఏలూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు దూలం నాగేశ్వరరావు  ముదినేపల్లి మండలంలోని చిగురుకోట గ్రామంలో వ‌ర్షాల కార‌ణంగా దెబ్బ‌తిన్న వరి పొలాలను పరిశీలించారు. ఆయ‌న వెంట‌ రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కోమటి విష్ణు వర్ధన్, ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ ఉన్నారు. 

చిలకలూరిపేట నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ మంత్రి విడదల రజిని ప‌రిశీలించారు.  ముంపున‌కు గురైన చిలకలూరిపేట పట్టణంలోని సంజీవనగర్, తండ్రి సన్నిధి, సుగాలి కాలనీ, వీర ముష్టి కాలనీ , గణపవరం శాంతి నగర్, పసుమర్రు ఎస్టీ కాలనీలను సందర్శించి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఆహారం, తాగునీరు అందజేశారు.  


 
హుకుంపేట మండల కేంద్రం, తాడేపట్టు పంచాయతీ నిమ్మళపాడు గ్రామంలో అర‌కు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ  పర్యటించారు.  తుపాన్ కారణంగా  నీట మునిగిన‌ వరి పంట పొలాలను  పరిశీలించారు.

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, పేడూరు గ్రామంలో మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ప‌ర్య‌టించారు.  స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు తిక్కవరపు సనత్ కుమార్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కొల్లిదిబ్బ గిరిజన కాలనీవాసులకు భోజనం, తదితర ఏర్పాట్లు చేశారు. 
 
సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ప‌రిశీలించారు. కాలనీవాసులకు బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.  

నంద్యాల ప‌ట్ట‌ణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్సీ ఇసాక్ బాష ప‌రిశీలించారు. నందమూరి నగర్, వైయస్ఆర్ న‌గ‌ర్‌లో నీట మునిగిన ఇళ్ల‌ను సంద‌ర్శించారు. త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను కోరారు.   

అద్దంకి పట్టణం, 20వ వార్డు ఎన్టీఆర్ నగర్‌లో తుపాన్‌ కారణంగా మరణించిన రేకునార్ లక్ష్మీ ,  వనపర్తి హనుమంత రావు  భౌతికకాయాలకు పూలమాలలతో నివాళులు అర్పించిన వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ..కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ఓదార్చారు. 

ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం లో మొంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులను లచ్చి పాలెం ఉప్పంగల చినబాపనపల్లి ఇంజరం గ్రామాలలో తుపాను వల్ల నష్టపోయినా పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే  పొన్నాడ సతీష్ కుమార్, రాష్ట్ర వైయ‌స్ఆర్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సిఇసి) సభ్యులు పితాని బాలకృష్ణ ప‌రిశీలించారు.

స‌త్తెన‌ప‌ల్లిలో నీట మునిగిన గొళ్ల‌పాడు కాల‌నీ, మాద‌ల‌వాగును ప‌రిశీలించిన వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ  సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌రెడ్డి ..వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితుల‌కు మందులు పంపిణీ చేశారు.

Back to Top