విజయనగరం: అధికార తెలుగు దేశం పార్టీకి బొబ్బిలి నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీడీపీకి వంద కుటుంబాలు గుడ్‌బై చెప్పాయి. బుధవారం బొబ్బిలి మండలం కొమటిపల్లి గ్రామానికి చెందిన సుమారు 100 కుటుంబాలు టీడీపీని వీడి మాజీ డిసిసిబి డైరెక్టర్ గొట్టాపు సూర్యనారాయణ , మాజీ సర్పంచ్ గొట్టాపు అప్పారావు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు వంగపండు శ్రీరాములు నాయుడు ఆధ్వర్యంలో వైయస్ఆర్‌సీపీ గూటికి చేరారు. బొబ్బిలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమక్షంలో వీరంతా వైయస్ఆర్‌సీపీలో చేరారు. వీరిని శంబంగి పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వ్యక్తులు మాట్లాడుతూ అధికార పార్టీ టిడిపిలో గ్రామ అభివృద్ధి కానరాకపోవడంతో నాయకుల తీరుపై విసిగిత్తి పోయి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు. అధికారంలోకి వచ్చేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేనని, గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పేర్కొన్నారు. పార్టీలో చేరిన నాయకులు వివరాలు: 1) వెలమల శంకర్రావు, మాజీ పార్టీ ప్రెసిడెంట్ 2) వెలమల ప్రకాష్ రావు 3) ముడిదాపు తిరుపతిరావు 4) గొట్టాపు త్రినాధరావు 5) మంతెన ధనంజయ 6) జెమదాల వెంకటరమణ 7) జక్కు తవిటి నాయుడు 8) సూది కొండ వేమన 9) వడ్డీ సునీలు 10) బొచ్చ జుజ్జులు 11) వెలమల అప్పలనాయుడు 12)వెలమల దాలినాయుడు 13)బోను త్రినాధ 14)పూడి గంగు నాయుడు మాజీ ఎంపీటీసీ 15)అట్టాడ రాములు మాజీ నీటి సంఘం చైర్మన్