రేపు వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేత‌ల‌తో వైయ‌స్ జ‌గ‌న్ స‌మావేశం

తాడేప‌ల్లి:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్టూడెంట్‌ వింగ్‌ అధ్యక్షులతో స‌మావేశ‌మ‌వుతారు. తాడేపల్లి  పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం నాయకులతో సమావేశ‌మై విద్యార్ధుల సమస్యలు, ఫీజు రీఇంబర్స్‌మెంట్, మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.

Back to Top