తాడేపల్లి: టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టీమిండియా విజయం సాధించడం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి జట్టు సభ్యులకు అభినందనలు తెలిపారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. టీమిండియా కెప్టెన్ సూర్యుకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచిందని ప్రశంసించారు. జట్టు సమిష్టి కృషితో దేశాన్ని గర్వపడేలా చేసిందన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్‌శర్మ, సంజు శ్యామ్‌సన్, ఇషాన్ కిషాన్, బూమ్రా వంటి క్రీడాకారుల ప్రదర్శన అద్భుతమని ట్వీట్ చేశారు.