మీ మెదడు డ్యామేజీ అయిందా బాబు గారూ?

చంద్ర‌బాబుకు వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చుర‌క‌లు

విశాఖ‌: సినిమా టికెట్ల‌కు, సిమెంట్ ధ‌రల‌కు ఏం సంబంధ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. `సినిమా టికెట్లకు, సిమెంటు ధరలకు ఏం సంబంధం? మీ మెదడుగానీ డ్యామేజీ అయిందా బాబు గారూ? హెరిటేజ్ పాలు ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నారని ఎవరైనా నిలదీశారా? మూవీ నిర్మాణం పక్కా వ్యాపారం. దానినీ, రాజకీయాలను మిక్సీలో వేసి తిప్పడం ఏంటి? ఎవరికి గాలం వేయడానికి ఈ డ్రామాలు?``

మర్చిపోతే ఎలా?
``మద్యం కొనుగోళ్లు, విక్రయాల లావాదేవీలను బెవరేజేస్ కార్పోరేషనుకు బదిలీ చేస్తే అడ్డదారి తొక్కడం ఎలా అవుతుంది బాబు గారు? ప్రభుత్వ నిర్ణయాలపై బాకా మీడియా ఏడుపేంటి? ఎన్నికల ముందు పసుపు-కుంకుమ ప్రలోభాల కోసం వేల కోట్లు అప్పులు తెచ్చిందీ, నిధులు మళ్లించిందీ మర్చిపోతే ఎలా?`` అని చంద్ర‌బాబుకు చుర‌క‌లంటించారు. 

Back to Top