బాబు బ్యాండ్‌ మేళం ప్రచారం మళ్లీ మొదలు 

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సెటైరిక‌ల్ కామెంట్స్‌

 న్యూఢిల్లీ :  రాష్ట్రంలో చంద్రబాబు బ్యాండ్ మేళం ప్రచారాలు మళ్లీ మొదలయ్యాయని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అలాగే, గతంలలో మాదిరిగానే అవే గ్రాఫిక్ అభివృద్ధి పనులు, అవే లక్షల కోట్ల గ్రాఫిక్ పెట్టుబడులు అంటూ కామెంట్స్‌ చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘చంద్రబాబు బ్యాండ్ మేళం ప్రచారాలు మళ్లీ మొదలయ్యాయి. చంద్రబాబు (2014-19) మధ్య కాలంలో ఎల్లో పత్రికల నిండా  వందల వేల లక్షల కోట్ల పెట్టుబడులు, అభివృద్ధి పనులు అని అమరావతిని సింగపూర్‌లా మార్చేస్తామని ఒక్కటే ప్రచారాలు, డప్పులు, భాజాబజంత్రీలతో హడావిడి చేశారు. చివరికి 2019 ఎన్నికల చివరి నాటికి పెట్టుబడులు, అభివృద్ధి శూన్యం. మరి ఏం చేశాడో చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబుది..

ఇప్పుడు మళ్లీ అదే మొదలైంది. 
అవే యెల్లో పత్రికలు.. 
అవే గ్రాఫిక్ అభివృద్ధి పనులు...
అవే లక్షల కోట్ల గ్రాఫిక్ పెట్టుబడులు...
ఇవేవీ వాస్తవరూపం దాల్చవు. యెల్లో మీడియా గ్రాఫిక్స్‌లో మాత్రమే ఉంటాయి. 
అందుకే అనేది చంద్రబాబువి ఉత్తిత్తి బ్యాండ్ ప్రచారాలు అని అంటూ సెటైర్లు వేశారు.

Back to Top