బాత్‌రూమ్‌కు ఒంటరిగా వెళ్లలేనోడు.. ధైర్యాన్ని నింపుతాడా..?

సీఎం వైయస్‌ జగన్‌ని విమర్శించే అర్హత లోకేష్‌కు లేదు

లోకేష్‌పై వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ధ్వజం

హిందూపురం: రాత్రిపూట తోడులేనిదే బాత్‌రూమ్‌కు కూడా వెళ్లడానికి భయపడే లోకేష్‌బాబు జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానికి ధైర్యం నింపాడానికి వచ్చాడని పచ్చపత్రికలు రాయడం హాస్యాస్పదమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్‌ అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి లోకేష్‌కు లేదన్నారు. నారా లోకేష్‌ ఓ దద్దమ్మ అని ధ్వజమెత్తారు. హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.50 కోట్లు ఇచ్చి అచ్చెన్నాయుడును కొనుగోలు చేయాలని ప్రయత్నం చేశామని లోకేష్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరినీ కొనుగోలు చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు లేదన్నారు. 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు సీఎం వైయస్‌ జగన్‌ వెంట ఉన్నారన్నారు. 

గతంలో వైయస్‌ఆర్‌ సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసిన తరువాత వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. అవినీతి చేసిన వారంతా ఆధారాల‌తో స‌హా అరెస్టు అవుతున్నార‌ని, రాజ‌కీయ క‌క్ష సాధింపు కాద‌న్నారు. జేసీ బ్రదర్స్‌ అక్రమాలకు చంద్రబాబు, లోకేష్‌ వత్తాసు పలుకుతున్నారని, ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న జేసీ బ్రదర్స్‌ను ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. 

తాజా ఫోటోలు

Back to Top