విజయవాడ: డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో నిరసనకు దిగారు. డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లేదని, మూడు లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంపై సమగ్ర చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశాల్లో డీఎస్సీ అక్రమాలపై చర్చించాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్‌రెడ్డి, కల్పలతారెడ్డి, రామచంద్రారెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే మండలి ఛైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ డీఎస్సీపై విచారణ జరిపించాల్సిందేనంటూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు తమ నిరసన కొనసాగించారు. డీఎస్సీ ప్రక్రియ సక్రమంగా జరగలేదు: మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ “డీఎస్సీ ప్రక్రియ సక్రమంగా జరగలేదు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. డీఎస్సీలో ఎక్కడా పారదర్శకత కనిపించడం లేదు. మూడు లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డీఎస్సీలో జరిగిన పరిణామాలపై సభలో చర్చ జరగాల్సిందే. మూడు లక్షల మంది అభ్యర్థులను ఏ విధంగా మోసం చేశారన్నది బయటకు రావాలి. డీఎస్సీలో పోస్టులు అమ్ముకున్నారనే ఆరోపణలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి. బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. డీఎస్సీ నియామక ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాత విచారణ ఉండాల్సిందే. ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుంది” అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.