పరామర్శ పేరుతో మాచర్లలో విధ్వంసానికి టీడీపీ కుట్ర

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజం

పల్నాడు: మాచర్లలో మరోసారి అలజడి సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గొడవలు సృష్టించాలనే కుట్రతోనే చలో మాచర్లకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిందన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ప్లాన్‌ ప్రకారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారన్నారు. గతంలో కూడా మాచర్లలో గొడవలు సృష్టించారని, ఇదంతా చంద్రబాబు కుట్రలో భాగమేనన్నారు. పరామర్శ పేరుతో మాచర్లలో విధ్వంసానికి కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్‌ మాఫియాతో కోట్ల రూపాయలు సంపాదించాడన్నారు. 
 

Back to Top