ఉదయించే సూరీడు వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌

పశ్చిమగోదావరి: ఉదయించే సూర్యుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. బీసీ గర్జనలో పాల్గొన్న అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. 40 లక్షల బీసీ కుటుంబాల్లో విద్యా దీపం అందించి జీవితాల్లో వెలుగులు నింపిన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి బిడ్డ వైయస్‌ జగన్‌కు ప్రజలంతా అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.  బీసీలంతా ఒక్క తాటిపైకి రావాలన్నారు. ఇంకా బీసీలను ఎన్నిసార్లు మోసం చేస్తారు చంద్రబాబూ అని ప్రశ్నించారు. తాటతీస్తాం, తోలు తీస్తామని హెచ్చరించిన నాయకుడికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 139 బీసీ కులాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైయస్‌ జగన్‌ వస్తున్నారన్నారు. చంద్రబాబు అస్తమించే సూర్యుడని, ప్రతి క్షణం, ప్రతి గంట కౌండౌన్‌ మొదలైందన్నారు. వైయస్‌ జగన్‌కు అండగా ఉంటాం. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. 

 

తాజా ఫోటోలు

Back to Top