మేనిఫెస్టో అంశాలను బీజేపీ నేతలు మర్చిపోయారా..?

రాజధానుల అంశం కేంద్రానికి సంబంధం లేదు

కొత్తపొత్తు పెట్టుకున్నా.. ఇంకా బాబును కాపాడే పనిలోనే పవన్‌

ఫిరాయింపులు ప్రోత్సహిస్తే చంద్రబాబు పక్కన ఒక్కరూ మిగలరు

వైయస్‌ఆర్‌ సీపీ ఫిరాయింపులకు వ్యతిరేకం

విశాఖలో ఎకరం అయినా కొనుగోలు చేసినట్లు నిరూపించగలరా..?

వికేంద్రీకరణకు చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విఫలమే

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఈ రాష్ట్ర ప్రజలంతా బలంగా విశ్వసిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా వికేంద్రీకరణను అడ్డుకోవడం అసాధ్యమన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని, కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. గతంలో ఇదే విషయాన్ని బీజేపీ నాయకులు సైతం చెప్పారని గుర్తుచేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లారంటే.. ‘రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్, వీరితో పాటు కొత్తగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ మాపై అనేక విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. వీటన్నింటికీ వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా.. విమర్శలు, ఆరోపణలపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. 

సీఎం, వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ మాట్లాడుతున్నారు. బీజేపీతో మూడు రాజధానుల విషయం చర్చించలేదు. చర్చించామని మేము చెప్పామా..? బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. రాజధానులను, అధికార వికేంద్రీకరణకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్, బీజేపీకి చెందిన బాధ్యులు చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పారు. రాజధాని వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం కానీ, కేంద్రానికి సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. 

బీజేపీ 2019లో మన రాష్ట్రంలో ఓడిపోయింది. ఎన్నికల సందర్భంలో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది.  ఆ మేనిఫెస్టోకు కట్టుబడి ఉన్నారా..? లేదా..? మేనిఫెస్టోలో చెప్పింది మర్చిపోయారా..? ఆ పార్టీ అధ్యక్షులు మర్చిపోయారా.. కొత్తగా పొత్తుకట్టి పవన్‌ మర్చిపోయారా..? సమాధానం చెప్పండి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టును శాశ్వతంగా రాయలసీమలోనే ఏర్పాటు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. దీనికి కట్టుబడి ఉన్నారా.. లేదా..? చెప్పాలి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా గుర్తిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. బీజేపీ చెప్పిన వాగ్దానాన్ని వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తుంటే.. ఒప్పుకోమంటే మీ పార్టీకి నైతిక లేదా..? బీజేపీ స్పష్టంగా చెప్పాలి. బీజేపీ విధానాలు ఏ కొద్దిమందికో సంపదను అర్జించే విధంగా ఉండవు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలకు సమానంగా పొందేలా ప్రణాళికలు రూపొందిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారు. వికేంద్రీకరణకు అనుకూలంగా ఉన్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా అధికార వికేంద్రీకరణకు ముందుకు వెళ్తుంది. 

అమరావతి రాజధానిగా అన్ని హంగులతో తీర్చిదిద్ది అభివృద్ధిపరుస్తాం. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి కృషిచేస్తాం. అమరావతి నిర్మాణం ఒక రియలెస్టేట్‌ వ్యాపారంగా సాగుతుంది. మూడు పంటలు పండే విలువైన భూమిని మోసం చేసి టీడీపీ ప్రభుత్వం మోసం చేసి తీసుకుంది. బీజేపీ అధికారంలోకి రాగానే అభ్యర్థించిన వారి భూములు తిరిగి ఇచ్చేస్తాం. అమరావతిలో దళితులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వారికి న్యాయం చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారు. బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. దళితుల భూములు అన్యాయంగా తీసుకుంటే.. అసైన్డ్‌ భూములకు సంబంధించిన జీఓను రద్దు చేసి తిరిగి దళితులకు భూములు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే.. ఇవాళ గందరగోళం చేస్తున్నట్లుగా బీజేపీ మాట్లాడుతున్నారు. రియలెస్టేట్‌ వ్యాపారం చేసే చంద్రబాబుకు అండగా నిలవాలని అనుకుంటున్నారా..? మోడీ చంక ఎక్కినా.. ఇంకా చంద్రబాబును కాపాడే ప్రయత్నమే పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నాడు.

రాష్ట్రానికి అధికార వికేంద్రీకరణ అవసరం అని సీఎం వైయస్‌ జగన్‌ భావించారు. గ్రామ స్థాయి నుంచి అది అమలు చేస్తున్నాం. 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి కూడా వికేంద్రీకరణ అవుతుంది. అమరావతిలోని సెక్రటేరియట్‌ను విశాఖలో, హైకోర్టును రాయలసీమలో పెట్టడంతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని నమ్ముతున్నాం. ప్రజలకు మేలు చేయాలనే ధృడ సంకల్పంతో సీఎం వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారు. చంద్రబాబు విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. బాబు విధానాలు నచ్చకే ప్రజలు ఓడించారు. 

భూదందాల కోసం మార్చుతున్నారని పవన్, చంద్రబాబు అంటున్నారు. విశాఖలో 4 వేల ఎకరాలు అంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు, సీఎం వైయస్‌ జగన్‌ ఎక్కడైనా ఒక ఎకరం కొనుగోలు చేసిన సందర్భం లేదు. పచ్చకామెర్ల వాడికి.. లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ప్రభుత్వ పెద్దలకు భూములు ఉన్నాయనేది నీచమైన ఆరోపణ. ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నామని చంద్రబాబు అంటున్నాడు. మాకు ఆ అవసరం లేదు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురిని మంత్రులను చేసిన చంద్రబాబు లాంటి దుర్మార్గామైన రాజకీయాలు చేసే నాయకుడు దేశంలోనే ఎవరూ లేరు. పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించే పార్టీ మాది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తే చంద్రబాబు దగ్గర ఒక్కరు కూడా మిగలరు. పార్టీ మారాలనుకునే వారు పదవికి, పార్టీకి రాజీనామా చేసి రావాల్సిందేనని మొట్టమొదటి శాసనసభలోనే చెప్పిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. 

కీలక బిల్లుపై చర్చ జరుగుతుంటే ఒక ప్రతిపక్ష నేత గ్యాలరీ ఎక్కి కూర్చోవడం ఎప్పుడైనా చూశారా..? వ్యవస్థలను భ్రష్టుపట్టించే దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు. వ్యవస్థల్లో సొంత మనుషులను చొప్పించి ఆ వ్యవస్థలను సర్వనాశనం చేస్తాడు. రూల్స్‌కు భిన్నంగా కౌన్సిల్‌లో సభ జరిగింది. చైర్మన్‌ కూడా తన అంతరాత్మకకు వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా కనిపించింది. పరిపాలన వికేంద్రీకరణతో మాత్రమే అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తున్నాం. చంద్రబాబు ఎన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేసి అడ్డుకోవాలని చూసినా అది విఫలమే అవుతుంది. 

రాజధాని ప్లాన్‌ వేయడం కోసం కన్సల్టెంట్లకు చంద్రబాబు రూ.840 కోట్లు ఇచ్చాడు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది ఎవరూ ప్రజలకు తెలుసు. కిలో మీటర్‌ మేర రోడ్డు వేయడానికి రూ. 45 కోట్లు. ఒక బల్డింగ్‌ కొట్టడానికి రూ.12 వేలు అడుగుకు ఖర్చు పెట్టారు. ప్రతిష్టాత్మకమైన బిల్లుపై వాదించేందుకు, చంద్రబాబు  లాబీయింగ్‌ అంతా బయటకు తీసేందుకు ముకులు రోహత్గీ అనే న్యాయవాదిని నియమిస్తే.. ఆ ప్లీడర్‌కు అంత ఇచ్చారు.. ఇంత ఇచ్చారని చంద్రబాబు గగ్గోలుపెడుతున్నారు. తన సొంత ఇంటి అదనపు ఖర్చు వద్దని జీఓ రద్దు చేసిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. ప్రజాధనాన్ని ఏ విధంగా వినియోగించాలో సీఎం వైయస్‌ జగన్‌కు తెలుసు 

తాజా వీడియోలు

Back to Top