వైయస్‌ జగన్‌ పేదల కష్టాలు దగ్గరుండి చూశారు

ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి
 

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర ద్వారా పేదల కష్టాలు దగ్గర నుంచి చూశారని ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి తెలిపారు. సభలో ఆయన మాట్లాడుతూ.. 2004లో వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చేనాటికి  ఉన్నత విద్య పేదలకు అందని ద్రాక్షలో ఉండేది. వైయస్‌ఆర్‌ పాదయాత్ర చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆయన బాటలోనే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. ఎంతో మంది విద్యార్థులు, తల్లిదండ్రులు చదువుల కోసం వైయస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. చదివించలేక కొందరు తల్లిదండ్రులు, పిల్లలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దేశంలో తిండిలేక చనిపోతున్నారని, టీడీపీకి ఇవన్నీ పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ వారి కష్టాలు దగ్గరినుంచి చూశారు కాబట్టే అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. తల్లులు తమ పిల్లలను బడికి తీసుకొస్తే..ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వారి చేయి పట్టుకొని నడిపిస్తున్నారని చెప్పారు. 
 

తాజా ఫోటోలు

Back to Top