చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియలేదా?

పవన్‌.. హామీల అమలు నీ బాధ్యత కాదా?

మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్‌

 అనంతపురం:  40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియలేదా?  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్ ప్ర‌శ్నించారు.  ఏపీలో కూటమి సర్కార్‌ హామీల అమలుకు పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు బాధ్యత తీసుకోరు అని ఆయ‌న నిల‌దీశారు. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా?. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు. బుధ‌వారం అనంత‌పురం న‌గ‌రంలో పార్టీ జిల్లా అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డితో క‌లిసి శైల‌జానాథ్ మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత తీసుకోరు?. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా?. టీడీపీ కూటమి.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ చంద్రబాబు జారుకునే యత్నం చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియలేదా? అని ప్రశ్నించారు.

పోరుబాట కొన‌సాగిస్తాం:  వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి

‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు తగదు. ప్రజా సమస్యలపై వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కొనసాగిస్తుంది. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. ప్రజల గొంతుకను అణచివేసేందుకు పోలీసులను ఉపయోగించుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. కక్షసాధింపు చర్యలు మానుకుని ఇచ్చిన హామీలను అమలు చేయండి` అని హితవు పలికారు. 

Back to Top