పక్కా ప్లాన్‌ ప్రకారమే సీఎం వైయ‌స్‌ జగన్‌పై దాడి  

మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

 విజయవాడ: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందో అర్థం కాలేదు. నా కంటికి కూడా దెబ్బ తగలడంతో విపరీతంగా నొప్పి వచ్చిందన్నారు మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సీఎం వైయ‌స్ జగన్‌పై దాడి ముమ్మాటికీ చంద్రబాబు పనే వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు ఆరోపించారు. 
 సీఎం వైయ‌స్ జగన్‌పై దాడిని  ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాన్‌ ప్రకారమే సీఎం వైయ‌స్ జగన్‌పై దాడి జరిగింది. దాడి చేసిన వెంటనే బాబు మార్క్‌ రాజకీయం మొదలుపెట్టారు. సీఎం జగన్‌పై దాడిని కూడా డ్రామా అనడం చంద్రబాబు నైజం. విచారణ వేగంగా జరుగుతుంది.. వాస్తవాలు బయటకి వస్తాయి. ఈ దాడి ఘటనపై ఎన్నికల కమిషన్‌ వెంటనే దర్యాప్తు చేయాలన్నారు. 

మరోవైపు, సీఎం వైయ‌స్ జగన్‌పై దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే రోజా నిరసనలు చేపట్టారు. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్నకు వస్తున్న ఆదరణ చూడలేకే చంద్రబాబు దాడులు చేయించారు. చంద్రబాబును తక్షణమే అరెస్ట్‌ చేయాలి. పవన్‌ కల్యాణ్‌ కుట్రలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

ఇక, ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలు సరికాదు. తన గెలుపు కోసం ఎదుటి వ్యక్తిని చంపాలనుకోవడం సిగ్గుచేటు. ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నారు అని కామెంట్స్‌ చేశారు. 

ఇది టీడీపీ దాడే.. లోకేష్‌ వ్యాఖ్యలే సాక్ష్యం: మంత్రి పెద్దిరెడ్డి 

 తిరుపతి: రాష్ట్రంలో ప్రజాదరణను చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి చేశారని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నారా లోకేష్‌ వ్యాఖ్యలను గమినిస్తే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని తెలుస్తోంది అంటూ విమర్శలు చేశారు.   
కాగా, మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధం సభలు, బస్సు యాత్రలో వస్తున్న ప్రజాదరణ చూసి ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌, పురంధేశ్వరి అందరూ నైరాశ్యంలో ఉన్నారు. సీఎం జగన్‌కు ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారు. ట్విట్టర్‌లో నారా లోకేష్‌ 2019 కోడి కత్తి, 2024లో రాయితో దాడి అని పోస్టు పెట్టారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని స్పష్టమవుతోంది. 

ఎవరైనా రాయితో దూరం నుంచి ప్లాన్‌ చేసి కొట్టించుకుంటారా?. అదే రాయిని లోకేష్‌కు ఇస్తాం. అదే ప్రాంతంలో బస్సు ఎక్కి ఎవరితో అయినా కొట్టించాలి. అప్పుడు కరెక్ట్‌గా ప్లాన్‌ చేసి రాయితో కొట్టించుకోవడం సాధ్యమవుతుందో లేదో తెలుస్తుంది. ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. గతంలో పాదయాత్రకు గుంటూరు దాటితే ఆదరణ కరువవుతోంది అన్నారు. కృష్ణా జిల్లా ఇంచార్జీగా ఆ ప్రాంతంలో పాదయాత్ర విజయవంతం చేశాం. మళ్ళీ నేడు బస్సు యాత్రకు అదే స్థాయిలో స్పందన రావడంతో ఈ కుట్రకు తెర లేపారు’ అని విమర్శలు చేశారు. 

Back to Top