దివంగత జీ.ఎస్. రావుకు వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఘన నివాళి 

కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన సజ్జల రామకృష్ణారెడ్డి 

తాళ్లపూడి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే దివంగ‌త  జీ.ఎస్. రావు కు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తాళ్లపూడి మండలం పెద్దెవం గ్రామంలోని ఆయన స్వగ్రామంలో జీ.ఎస్. రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్  సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు ,  జోగి రమేష్‌,  శైలజానాథ్ , జిల్లా అధ్యక్షుడు  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ , శాసనమండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి , రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ , రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా , రాజమహేంద్రవరం పార్లమెంట్ సమన్వయకర్త  డాక్టర్ గూడూరి శ్రీనివాస్ , గోపాలపురం మాజీ ఎమ్మెల్యే  తలారి వెంకట్రావు , పోలవరం మాజీ ఎమ్మెల్యే  తెల్లం బాలరాజు తో పాటు పలువురు వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు జీ.ఎస్. రావు ప్రజా జీవితంలో అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజాసేవకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి దుఃఖంలో తాము భాగస్వాములమని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.


 

Back to Top