విశాఖపట్నం: అనారోగ్య సమస్య కారణంగా విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైయస్ఆర్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దాడిశెట్టి రాజాను వైయస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు , మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ , పార్టీ నేతలు దవులూరి దొరబాబు, కరణం ధర్మశ్రీ, చిక్కాల రామారావు తదితరులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. దాడిశెట్టి రాజా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో మరింత ఉత్సాహంగా కొనసాగాలని పార్టీ నాయకులు అభిలషించారు.